ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; మరాఠా వీరుడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గురువారం ఆదిలాబాద్ జిల్లా పుత్తూరు మండలంలోని సాలెవాడ( కె)లో ఘనంగా నిర్వహించారు. చత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. చత్రపతి శివాజీ చూపిన మార్గంలో నడవాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సాల్గరే రవీందర్, ఉత్సవ కమిటీ సభ్యులు అనిల్ మారుతి, నర్సింగ్, మనోహర్, ఓంకార్, నారాయణ, కార్తీక్, విశాల్, తదితరులు పాల్గొన్నారు.
