ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు..

నిజాంపేట, ఆంధ్రప్రభ ; మండల వ్యాప్తంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ సమీపంలో గురువారం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు అలాగే శ్రీనివాస వైన్స్ నిర్వాహకులు ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని చత్రపతి విగ్రహనికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజును చరిత్రలో స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఆయన 17 సంవత్సరాల వయస్సు లోనే భవాని మాత ఖడ్గంతో హిందుత్వం పై నీలి నీడలు కమ్మిన సమయంలో విదేశీ దురక్రమణ దారుల నుంచి హిందుత్వాన్ని భారతదేశాన్ని రక్షించుకోవడానికి ఆయన చేసిన కృషి ఫలితం ఎంతో ఉందన్నారు. భారతదేశంలో భారతీయులంతా చత్రపతి శివాజీ మహారాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అలాగే నస్కల్ గ్రామంలో చత్రపతి సేన యూత్ ఆధ్వర్యంలో చత్రపతి విగ్రహ ప్రతిష్ట కోసం భూమి పూజ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చలిమేటి నరేదర్, ఉప సర్పంచ్ గెరిగంటి బాబు,గ్రామస్తులు కొమ్మట బాబు,లక్ష్మణ్, శివ ప్రసాద్, కిశోర్ గౌడ్, కిషన్ గౌడ్, జాల పోచయ్య, పంజా బాబు, సుధాకర్, పర్షా గౌడ్, శ్రీకాంత్,శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్, రాజు, మధు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply