Chennuru | విజయం మాదే..

Chennuru | విజయం మాదే..

Chennuru, కల్లూరు, ఆంధ్రప్రభ : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రజాక్షేత్రంలో నూటికి నూరు శాతం గెలుపు తమదేనని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చెన్నూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి శిరసాని జమలయ్య ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతో తాను ప్రజాక్షేత్రంలో సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నానని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ప్రజా సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత కరెంటు, ఫ్రీ బస్సు, రైతాంగానికి సన్న వడ్లు పై ఇచ్చిన బోనస్ ప్రజల హృదయాలలో నిలిచాయని చెప్పారు.

దానికి తోడుగా గతంలో తాను సర్పంచిగా ఈ గ్రామానికి సేవ చేశానని, గ్రామ అభివృద్ధిలో ప్రజలతో భాగస్వామి అవుతూ గ్రామ అభివృద్ధికి బాటలు వేశానని అన్నారు. ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని సత్వర అభివృద్ధి చేయడానికి ప్రణాళిక బద్ధంగా పని చేస్తానని, రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందిస్తానని అన్నారు. గ్రామంలో రక్షిత మంచినీటి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ పెద్దల ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఎన్నికలలో తనకి అందించిన టూత్ పేస్ట్ గుర్తు పై తమ అమూల్యమైన ఓటు ముద్ర వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

Leave a Reply