Chennur | జనసంద్రం.. పంచక్రోష ఉత్తరవాహిని తీరం..

Chennur | జనసంద్రం.. పంచక్రోష ఉత్తరవాహిని తీరం..
Chennur, ఆంధ్రప్రభ : మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని చెన్నూరు పవిత్ర పంచ క్రొష ఉత్తరవాహిని గోదావరిలో పుణ్యస్నానం ఆచరించేందుకు భక్తులు బారులు తీరాడంతో గోదావరితీరం జనసంద్ర మైంది. మహాశివరాత్రి పర్వదిననా పుణ్యాస్నానం ఆచరించడంతో పుణ్యఫలం లభిస్తుందన్న నమ్మకం. కాశీ అంత విశిష్టత కలిగిన చెన్నూరు పంచ క్రొశ ఉత్తరవాహినిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు చెన్నూర్ తో పాటు మంచిర్యాల, తదితర పట్టణాల నుంచి భక్తులు తరలివచ్చారు.
