Chennur | బీజేపీ లో చేరిన బీఆర్ఎస్ ఎస్సి సెల్ సెక్రెటరీ

Chennur | బీజేపీ లో చేరిన బీఆర్ఎస్ ఎస్సి సెల్ సెక్రెటరీ

Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల్ జిల్లా చెన్నూరు పట్టణంలోని 5వ వార్డు నల్లగొండ పోచమ్మ వీధి స్థానిక బీఆర్ఎస్ ఎస్సీ సెల్ స్టేట్ సెక్రటరీ, టీఎస్ ఎమ్మార్పీ ఎస్ జిల్లా అధ్యక్షులు తగరం మధు రాజ్ పట్టణ బీజేపీ అధ్యక్షులు తుమ్మ శ్రీపాల్ అద్యక్షతన జిల్లా బీజేపీ అధ్యక్షులు నగునూరీ వెంకటేశ్వర్ గౌడ్ భారతీయ జనతా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. మధురాజ్ తో పాటు దాదాపుగా 50 మందిని పార్టీలో చేర్పించడం జరిగింది. అనంతరం నూతనంగా పార్టీలో చేరిన మధు రాజు మాట్లాడుతూ.. దేశంలో కరోనా కష్ట కాలంలో దేశ ప్రజలదరికీ ఉచిత టీకా పంపిణీ చేసి రక్షించింది మోడీ ప్రభుత్వం అని చెప్తూ దేశ అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమని పార్టీలో చేరడం జరిగిందన్నారు. పట్టణంలో బీజేపీ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

అనంతరం జిల్లా బీజేపీ అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ… ఈరోజు దేశం ఇంతగా అభివృద్ధి చెందుతుందంటే న‌రేంద్ర మోదీ ప్రభుత్వం వల్లనే అని చెప్తూ పట్టణ ప్రాంతాల్లో ఈరోజు ఏదైతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోనేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, మాజీ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు రాపర్తి వెంకటేశ్వర్, కొండపాక చారి, రత్న లక్ష్మీనారాయణ, మంత్రి రామయ్య, కాశెట్టి నాగేశ్వర్, తలారి రాజు, ఏతం శివకృష్ణ, వెంకటేష్, వెంకట్, సతీష్, త‌దితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply