తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకమార్గంలో వెళ్తున్న భక్తులకు 7వ మలుపు వద్ద చిరుత కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్నారు.
దీనిపై స్పంధించిన టీటీడీ భక్తులను అప్రమత్తం చేసింది. చీకటిలో ఒంటరిగా వెళ్లొద్దని, గుంపులుగా వెళ్లాలని సూచించారు.