Crime | నేరాలు త‌గ్గాయ్‌..

Crime | నేరాలు త‌గ్గాయ్‌..

  • ఎస్పీ చొర‌వ‌తో కేసులు న‌మోదు త‌గ్గుముఖం
  • వివ‌రాలు వెల్ల‌డించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్

Crime | ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిశోర్(SP Kommi Pratap Sivakishore) ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం సమిష్టి కృషితో 2025లో నేరాలను అదుపు చేశారు. ఆయ‌న పదవీ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి నేర నియంత్రణ, గంజాయి, నాటు సారాయి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం, ఇసుక అక్రమ రవాణా జరగకుండా స‌రిహ‌ద్దుల్లో పటిష్టమైన చెక్‌పోస్టుల‌(Checkposts)ను ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్భంగా ఈ రోజు 2025లో న‌మోదైన కేసుల వివ‌రాలు ఎస్పీ వెల్ల‌డించారు. 2025లో 26 మర్డర్ కేసులు నమోదు కాగా, 2024లో 39 కేసులు, 2023 లో 35 కేసులు నమోద‌య్యాయి. సదరు హత్య కేసులు(murder cases), సెక్సువల్ జెలసి, సరిహద్దు తగాదాలు, పెట్టి తగాదాల మూలముగా జరిగినవి. అన్ని కేసులలో ముద్దాయిలను అరెస్టు చెయ్యడం జరిగింది.

Crime |
  • 2025 లో 29 అపహరణ కేసులు నమోదు కాగా, 2024 లో 54 కేసులు, 2023 లో 106 కేసులు నమోదు చేయడమైనది. అపహరణ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడం జరిగింది.
  • 2025 లో 59 మానభంగం కేసులు నమోదు కాగా, 2024 లో 80 కేసులు, 2023 లో 63 కేసులు నమోదు చేయడమైనది. జిల్లాలో మహిళల భద్రతకు అన్నీ రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందువలన మానభంగం కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడం జరిగింది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడం జరుగుతుంది.
  • 2025లో, 125 పిఓసిఎస్ఓ యాక్ట్ కేసులు నమోదు కాగా, 2024లో 160కేసులు, 2023లో 147 కేసులు నమోదు చేయడమైనది. జిల్లాలో పిల్లల యొక్క భద్రతకు అన్నీ రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే కొత్త చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. స్కూలు, కాలేజీలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ర్యాగింగ్, పిల్లల చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తుండడం జరుగుతుంది. ఇందువలన పీ.ఓ.సీ.ఎస్.ఓ.యాక్ట్ కేసులు గణనీయంగా తగ్గుముఖం ప‌ట్టాయి.
  • 2025 లో 765 హర్ట్ కేసులు నమోదు కాగా, 2024 లో 955 కేసులు, 2023 లో 1131 కేసులు నమోదు చేయడమైనది. నిరంతరం పోలీసు వారు పగలు మరియు రాత్రి గస్తీ తిరుగుచూ ఎప్పటి కప్పుడు సమాచారం సేకరించడం వలన జిల్లాలో హర్ట్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడం జరిగింది.
  • 2025 లో 253 వైట్ కాలర్ నేరాలు నమోదు కాగా, 2024 లో 340 కేసులు, 2023 లో 426 కేసులు నమోదు చేయడమైనది. నిరంతరం పోలీసుల‌ పరిధిలో ప్రజలకు వైట్ కాలర్ నేరాలపై అవగాహన సదస్సులు నిర్వహించి, వారిని అవగాహన కలిగించడం వలన జిల్లాలో వైట్ కాలర్ నేరాలు గణనీయంగా త‌గ్గాయి.
  • 2025 లో కేవలం 54 ఎస్సీ మరియు ఎస్టీ (పి.ఓ.ఏ) యాక్ట్ కేసులు నమోదు కాగా, 2024లో 102 కేసులు, 2023 లో 127 కేసులు నమోదు చేయడమైనది. ఎస్సీ, ఎస్టీ (పీ.ఓ.ఏ) యాక్ట్ గురించి జిల్లా అంతటా ప్రజలకు తరచుగా అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. పోలీసులు తీసుకున్న చర్యలతో ఎస్సీ మరియు ఎస్టీ (పి.ఓ.ఏ)యాక్ట్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడం జరిగింది.
  • మర్డర్ ఫర్ గైన్ ఈ 2025 సంవత్సరంలో 1 కేసు నమోదు కాగా, 2024 వ సంవత్సరములో 3కేసులు నమోదు చేసినట్లు 2023 వ సంవత్సరంలో1కేసును నమోదు చేసినట్లు, సదరు కేసులలో ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగింది.
  • డెకాయిటీలు ఈ 2025లో 3 కేసులు నమోదు కాగా, 2024 వ సంవత్సరములో1 కేసును నమోదు చేసినట్లు 2023వ సంవత్సరంలో 3 కేసులను నమోదు చేసినట్లు, సదరు కేసులలో ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడం జరిగింది.
  • రోబరీలు ఈ 2025 సంవత్సరంలో 7 కేసులు నమోదు కాగా, 2024 వ సంవత్సరములో 9 కేసులు నమోదు చేసినట్లు 2023 వ సంవత్సరంలో 10 కేసులను నమోదు చేసినట్లు, సదరు కేసులలో ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడం జరిగింది.
  • ఇంటి దొంగతనాలు 2025లో 44 కేసులు నమోదు కాగా, 2024లో 56 కేసులు, 2023లో 42 కేసులు నమోదు చేసినట్లు, ఈ సంవత్సరం అన్ని కేసుల్లో ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి దొంగిలించబడిన ఆస్తిని స్వాధీనం చేసుకుని ముద్దాయిలను జుడిషియల్ రిమాండ్‌కు పంపడం జరిగింది.
  • 2025 లో 699సాధారణ దొంగతనము కేసులు నమోదు కాగా, 2024లో 681 కేసులు, 2023 లో 561 కేసులు నమోదు చేసినట్లు, ఈ సంవత్సరం సగానికి పైగ కేసుల్లో ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి దొంగిలించబడిన ఆస్తిని స్వాధీనం చేసుకుని ముద్దాయిలను జుడిషియల్ రిమాండ్‌కు పంపించారు.
  • 2025వ సంవత్సరం ఆస్తి సంబంధమైన కేసులలో 04 కోట్ల26 లక్షల12వేల 406 రూపాయల ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు, సదరు ఆస్తి 68% పర్సెంట్ గా ఉంది.
  • తరువాత ఈ సంవత్సరం, పాత సంవత్సరాలలో జరిగిన 78 కేసులలో ముద్దాయిలను అరెస్టు చేసి రూ.53,44,225లు ఆస్తిని స్వాధీనం చేసుకొనటం జరిగింది.
  • ఈ సంవత్సరంలో జరిగిన ఆస్తి సంబంధమైన కేసులలో ఆధునిక పద్ధ‌తిలో అనగా ఫింగర్ ప్రింట్స్ ద్వారా 65 కేసులను, సీసీ టీవీ పుటేజీల ద్వారా 105 కేసులను కాల్ అనాలిసిస్ ద్వారా 148 కేసులను చేధించడం జరిగింది.
  • జిల్లాలో ఆస్తి సంబంధిత నేరాలను నియంత్రించుటకు, ప్రజల భద్రతను మరింత మెరుగుపరచుటకు పోలీసు శాఖ పలు నివారణ చర్యలను అమలు చేస్తుంది.
Crime |

నిరంతర గస్తీ చర్యలు..
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పగలు, రాత్రి వేళల్లో మొబైల్ గస్తీ, ఫుట్ పెట్రోలింగ్‌ను పెంచి, నేరాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

సెన్సిటివ్ ప్రాంతాల గుర్తింపు
గత నేరాల ఆధారంగా నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు, నిఘా ఏర్పాటు చేయబడింది.

సీసీ కెమెరాల వినియోగం
ప్రధాన కూడళ్లలో, మార్కెట్ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేయించడంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ, నిఘాను మరింత పటిష్టం చేస్తున్నాం. అనుమానాస్పద వ్యక్తులపై నిఘాపాత నేరస్తులు, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచి, అవసరమైన చోట బౌండ్ ఓవర్ చర్యలు తీసుకుంటున్నాం. వాహన తనిఖీలు, నాకాబందీరాత్రి వేళల్లో అనుమానాస్పద వాహనాల తనిఖీలు, ఆకస్మిక నాకాబందీలు నిర్వహించి, చోరీలకు పాల్పడే గ్యాంగ్‌లను అడ్డుకుంటున్నాం. ప్రజల భాగస్వామ్యంతో పోలీసింగ్ కాలనీ కమిటీలతో సమావేశాలు నిర్వహించి, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను ప్రోత్సహిస్తున్నాం.

Crime |

Crime |అవగాహన కార్యక్రమాలు

ఇళ్లకు తాళాలు వేసేటప్పుడు జాగ్రత్తలు, విలువైన వస్తువుల భద్రత, పొరుగువారితో సమన్వయం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

Crime |త్వరిత స్పందన వ్యవస్థ

డయల్ 112 మరియు ఇతర అత్యవసర సేవల ద్వారా వచ్చిన సమాచారానికి తక్షణ స్పందన కల్పిస్తూ, నేరాలను మొదటిదశలోనే అడ్డుకుంటున్నాం. ఈ చర్యల ద్వారా జిల్లాలో ఆస్తి నేరాలను గణనీయంగా తగ్గించడమే కాకుండా, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే మా ముఖ్య ఉద్దేశ్యం అని పోలీసు శాఖ తెలియజేస్తోంది. ఈ సంవత్సరం 2025 లో, 2 కేసులలో రెండు జీవిత జైలు శిక్షలు, 3 కేసులలో ముద్దాయిలకు 20 సంవత్సరాలు జైలు శిక్ష, 9 కేసులలో ముద్దాయిలకు జీవిత ఖైదు,3 కేసులలో ముద్దాయిలకు 10 సంవత్సరాలు జైలు శిక్ష, 3 కేసులలో ముద్దాయిలకు 7 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 3 కేసులలో ముద్దాయిలకు 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగింది.

శిక్షల విధానం క్రైమ్ కేసులు…

రెండు జీవిత జైలు శిక్షలు
హత్య కేసులు 2
20 సంవత్సరాలు జైలు శిక్ష
పి.ఓ.సి.ఎస్.ఓ రేప్ కేసులు 3, జీవిత జైలు శిక్ష 8, హత్య కేసులు 1, పి.ఓ.సి.ఎస్.ఓ రేప్ 9,
10 సంవత్సరాలు జైలు శిక్ష
రేప్ కేసులు 3,7 సంవత్సరాలు జైలు శిక్ష1, హత్య కాని నరహత, 1, వరకట్న హత్య 1, మానభంగ యత్నం 3,

Crime |5 సంవత్సరాలు జైలు శిక్ష
హత్య కేసులు 3, మొత్తం 23…

గత సంవత్సరంలో కోర్టులో త్వరితగతిన ట్రైలు నిర్వహించేలాగా జిల్లాలో కోర్టు మోనిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి ఒక సీఐ స్థాయిలో అధికారిని, కొంతమంది సిబ్బందిని నియమించి, ప్రతి కేసులోనూ శిక్ష పడేటట్లుగా చర్యలు తీసుకొనడం జరుగుతుంది.

Crime |రహదారి ప్రమాదాలు…

2025లో మొత్తం వాహన ప్రమాదాలు 713 నమోదు కాగా, 2024 లో 595 కేసులు మరియు 2023 లో 633 కేసులను నమోదు చేయ‌డం జరిగింది. 2025 లో 15,234 కేసులు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై,1668 కేసులు ప్రమాదకరంగా వాహనాలు నడిపిన వారిపై అలాగే మొత్తంగా 62,642 కేసులు వాహనదారులపై నమోదు చేసి రూ.3,08,83,281లను అపరాధ రుసుముగా వేయడమైనది. 2025లో మద్యం సేవించి వాహనాలను నడుపుతూ పట్టుపడిన వారిపై, 2361 కేసులు నమోదు చేసి రూ.31,41,000 అపరాధ రుసుంగా వేయ‌డం జరిగింది.

రహదారి ప్రమాదాల నివారణ కొరకు తరచుగా వాహనాలను చెకింగ్ చేస్తూ, వాహన ప్రమాదాల నివారణ కొరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలను నిర్వహణ చేస్తూ, రహదారులపై రాత్రిపూట వాహన చోదకులకు వాష్ అండ్ డ్రైవ్ ప్రోగ్రాంను హైవేలపై 8 రోడ్ సేఫ్ మొబైల్ వాహనాల ద్వారా ప్రతినిత్యం నిర్వహించడం, అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు బ్లాక్ స్పాట్లను గుర్తించడం, ఇతర సంభంధిత శాఖల సిబ్బందితో కలసి నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

ఈ సంవత్సరంలో ఈ క్రింది నివారణ చర్యలు తీసుకోవడం జరిగింది. 218 సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 58 స్పీడ్ లిమిట్ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది.33 థెర్మో ప్లాస్టిక్ రంబుల్ స్ట్రయిపస్ ఏర్పాటు చేయడం జరిగింది. 12 కెమెరాలను బ్లాక్ స్పాట్ లలో ఏర్పాటు చేయడం జరిగింది. 7స్థలాలలో లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 2చోట్ల రోడ్డు ఎంక్రోచ్మెంట్స్ చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు 1750 అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. రోడ్డు ప్రమాదాలపై విధ్యార్ధులకు 126 అవగాహన సదస్సులు కాలేజీ, మరియు స్కూళ్ల లోనూ నిర్వహించడం జరిగింది.

Crime |

2025లో అక్రమ నాటు సారా తయారీదారులు, అక్రమ మద్యం తరలించు వారిపై 70 కేసులను నమోదు పరిచినట్లు సదరు కేసులలో 84 ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1260 ఐ.ఎం.ఎఫ్.ఎల్. మద్యం సీసాలను, 911.5 లీటర్ల నాటు సారాయిని, 2,600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయ‌డం జ‌రిగింది. 9వాహనాలను స్వాధీనం చేసుకున్నాం.

2025లో జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణా చేస్తున్న వారిపై 15 కేసులు నమోదు పరిచి 49 మంది ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 49,62,977లు విలువగల 505.275 కేజీల గంజాయిని మరియు సదరు కేసులలో 12 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది.

అంతర్ రాష్ట్ర బోర్డర్ చెక్ పోస్టుల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిరంతరం అన్నీ అక్రమ రవాణాలపై నిఘా పెట్టడం జరిగింది.

పేకాట ఆడేవారిపై 938 పేకాట కేసులు నమోదు చేసి, 3,816 మంది ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.69,67,516 లు, 361 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది..

కోడి పందేలపై 526 కేసులను నమోదు చేసి 1,871 మందిని అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి రూ.17,65,995లు, 698 కోడిపుంజులను, 2,736 కోడి కత్తులను, 221 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది.

  • క్రికెట్ బెట్టింగ్, ఇళ్ళల్లో, ఇండోర్స్ లో జరిగిన జూదంలపై 28 కేసులు నమోదు పరిచి, 516 మంది ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.48,28,655 లను, 186 వాహనాలను స్వాధీనం చేసుకున్నాం. 2025లో ప్రజలు తిరుగు స్థలాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై 8853 కేసులు నమోదు చేసి, వారిని సంబంధిత గౌరవ కోర్టులలో హాజరు పెట్టి శిక్షలు, జరిమానా విధించడం జరిగింది.

2025లో మొత్తం 574 మిస్సింగ్ కేసులు నమోదు చేయగా, ఆ కేసులలో మిస్సింగ్ అయిన 624 వ్యక్తుల్లో, 546 మిస్సింగ్ పర్సన్స్ ను వెతికి పట్టుకుని వారి కుటుంబ సభ్యులకు అప్ప‌గించ‌డం జరిగింది. వారిలో 257 మంది ఆడవారు, 120 మంది బాలికలు, 29 మంది బాలురు, 140 మంది మగవారు ఉన్నారు.

అలాగే 2025లో చెడు నడత గల వారిపై 117 రౌడీ షీట్స్, 62 సస్పెక్ట్ షీట్స్.. మొత్తం 179 హిస్టరీ షీట్స్‌లను ఓపెన్ చేయడమైనది. అలాగే వారిపై నిరంతర నిఘా పెట్టడం జరిగింది.

అలాగే 2025 నవంబరు నెలలో, ఏలూరు నగరంలోని కే.కే.ఆర్ గ్రీన్ సిటీలో రహస్యంగా షెల్టర్ తీసుకుంటున్న 15 మంది మావోయిస్టులను చాకచక్యంగా అరెస్టు చేసి, కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి 15 మారణాయుధాలు (తుపాకులు, రివాల్వర్ లు వాటికి సంబంధించిన తూటాలు) వశపర్చుకొని, వారిని అందరినీ జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపడం జరిగింది.

భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం వారి యొక్క ఆదేశాలపై నిర్వహిస్తున్న నేషనల్ లోక్ అదాలత్ ద్వారా 2025లో 4 దఫాలుగా మొత్తం 12,658 కేసులలో కక్షిదారులకు రాజీయే రాజమార్గం అని నిర్వహించినట్లు, గత సంవత్సరంతో (4849) పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువ కేసులలో లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు రాజీ ప‌డ్డారు.

2025లో సైబర్ క్రైమ్ 61 కేసులు నమోదు కాగా, సదరు కేసులలో రూ. 20,11,00,863లు హోల్డ్ చెయ్యడం జరిగింది. రూ.22,70,465లు బాధితులకు అందజేయడం జరిగింది. మిగిలిన నగదు కూడా బాధితులకు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా, సైబర్ కేసులలో, ఆధునిక పద్ధతులను అనుసరించి, ముద్దాయిలను గుర్తించి దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వారిని అరెస్టు చేయడం జరుగుతుంది. వారి వద్ద నుంచి పోయిన నగదును స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది.

ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా, డ్రోన్స్ ఉపయోగించి, 2 గంజా కేసులు, వైరు దొంగిలించే 2 గ్యాంగ్ లు, 823 ఓపెన్ డ్రింకింగ్ కేసులు,13 గంజా స్మోకింగ్ కేసులు, 15 బ్రోతల్ కేసులు, 33 జూద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. సదరు డ్రోన్స్ ను 22 పోలీసు స్టేషన్ పరిధులలో వాడడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజూ పండగలకు, ఉత్సవాలకు, రేలిస్, ఊరేగింపులకు, వీఐపీల బందోబస్తు డ్యూటీలకు, ట్రాఫిక్ పునరుద్ధించుటకు, క్రౌడ్ ఏరియాలు, విద్యాసంస్థల వద్ద గస్తీలకు ఉపయోగించడం జరుగుతుంది.

  • ఇప్పటిపరకు, జిల్లాలో 902 అనుమానాస్పద, సమస్యాత్మక ప్రాంతాలలో 5101 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిరంతరం నిఘా పెట్టడం జరిగింది.

జిల్లాలో మొబైల్ ఫోన్లు రికవరీ కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 955035100 ఏర్పాటు చేసి ఫోన్ పోగొట్టుకున్న వారు ఈ నెంబర్‌కు ఫోన్ చేసిన ఎడల సీసీఎస్ మరియు సైబర్ సెల్ సిబ్బంది జిల్లాలో ఇప్పటివరకు 4038 మొబైల్ ఫోన్లు సుమారు రూ.5,33,35,684 విలువ కలిగినటువంటివి రికవరీ చేసి ఫోన్ సొంతదారులకు అందజేయ‌డం జరిగింది.

ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మొదలగు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సమాజంలో జరిగే కొత్త, కొత్త నేరాలు పట్ల ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహనను కల్పిస్తుండడం జరుగుతుంది.

ప్రజలకు సత్వర న్యాయ సహాయం అందించే నిమిత్తంగా రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఆదేశాలపై ప్రతి సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పి.జి ఆర్.ఎస్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 2025వ సంవత్సరంలో 3672 పిటిషన్లు ఫిర్యాదుదారులు అందించగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడం జరిగింది.

2025లో కోర్టు ద్వారా తీర్పు ఇచ్చిన కేసులలో, 2594 కేసులలో ముద్దాయిలకు శిక్షలు విధించినట్లు, శిక్ష రేటు 66శాతం గా ఉండటం జరిగింది.

శాంతిభద్రతల పరిరక్షణ కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడిన సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రామ సంరక్షణ మహిళా కార్యదర్శి ద్వారా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో మహిళా పోలీసుల ద్వారా సర్వేని నిర్వహించి సదరు సర్వేలలో సరిహద్దు గొడవల గురించి, ప్రాపర్టీ డిస్పూట్ గురించి, ఫ్యామిలీ డిస్పూట్ గురించి, పొలిటికల్ డిస్పూట్ గురించి డేటాను సేకరించి, జాబ్ ఫ్రాడ్ గురించి మరియు ఆత్మహత్యల నివారణ కొరకు అనేక విషయాలలో ముందస్తు సమాచారాన్ని సేకరిస్తూ సదరు సమాచారాన్ని సేకరించి స్టేషన్ హౌస్ అధికారులు సదర విషయాలపై ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

సచివాలయల పరిధిలో 14 – 18 సంవత్సరాల బాలికలను గుర్తించి వారికీ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా జరిగే అనర్థాలను గురించి అవగాహనను కల్పిస్తూ సదరు బాలికల యొక్క తల్లిదండ్రులకు కూడా అవగాహనను కల్పించి ఏ విధమైన అవాంతరాలు కలగకుండా ఉండేలాగా భరోసా కల్పిస్తున్నారు.

2024లో కొత్తగా అమలులోకి వచ్చిన చట్టాలు అనగా భారతీయ న్యాయ సంహిత (బి.ఎన్.ఎస్), భారతీయ నాగరిక్ సూరక్షా సంహిత (బి.ఎన్.ఎస్.ఎస్) మరియు భారతీయ సాక్ష్య అధినియం (బి.ఎస్.ఏ) లపై ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు మరియు విధ్యార్ధులకు ప్రతి నెల అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది.

2025 లో అర్హత గల సిబ్బందికి సివిల్ పి.సి.ఎస్ నుంచి హెచ్.సి.ఎస్ -5 , ఏ.ఆర్ పి.సీ.ఎస్ నుంచి హెచ్.సి.ఎస్-10 ప్రమోషన్ లను ఇవ్వటం జరిగింది. మరియు కారుణ్య నియామకాలు క్రింద చనిపోయిన పోలీస్ కుటుంబ సభ్యులు ముగ్గురికి (3) నియామకాలు ఇవ్వటం జరిగింది.

Crime |2026లో ఏర్పాటు చేసుకొన్న ప్రాధాన్యతలు..

రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు, శాంతి భద్రతల పరిరక్షణ కొరకు, సిబ్బంది సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యతలను రూపొందించినట్లు, సైబర్ నేరాల నివారణ కొరకు, స్త్రీలు మరియు పిల్లలపై జరిగే నేరాలను అరికట్టుట కొరుకు అధికారులు అందరూ సమిష్ఠ కృషితో ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా అడుగులను వేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కె. ప్రశాంత్ శివ కిశోర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ సూర్య చంద్రరావు(Additional SP Surya Chandra Rao), ఏలూరు డీఎస్పీ డి. శ్రావణకుమార్, డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ ఎండి. హబీబ్ బాష, ఎస్.బి.ఇన్స్పెక్టర్ యం.వి.వి. మల్లేశ్వర రావు, డి.సి.అర్.బీ యస్.ఐ ఎస్.రామకృష్ణ, ఎస్.బి ఎస్ఐ గంగాధర్, సైబర్ సెల్ సీఐ దాసు, డి.సి.అర్.బి, ఐ.టి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

CLICK HERE TO READ MORE శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో..

CLICK HERE TO READ MORE

Leave a Reply