Chattisgarh | మ‌రో ఎన్‌కౌంటర్‌ – ఇద్దరు మావోయిస్టులు మృతి

చింతూరు, ఆంధ్రప్రభ : ఛత్తీస్‌గఢ్‌ (chattisgarh ) రాష్ట్రంలో పోలీసులకు (Police ) మావోయిస్టులకు (maoists) మధ్య శుక్రవారం ఉదయం కాల్పులు(firing) జరిగాయ. ఈ ఎదురుకాల్పులలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. కాంకేర్ జిల్లాలోని చోటే బేటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచారిస్తున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. శుక్రవారం ఉదయం పోలీసులకు మావోయిస్టులు తారస పడటంతో కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్ ను కాంకేర్ జిల్లా ఎస్పీ ఐకే ఎల్లిసెల ధ్రువీకరించారు.

Leave a Reply