Charitable Trust | అనునిత్యం ప్రజా సమ్యలపై ….

Charitable Trust | అనునిత్యం ప్రజా సమ్యలపై ….
Charitable Trust | కరీమాబాద్, ఆంధ్రప్రభ : జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా రామన్నపేటలోనీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ (Dr. Rajendra Prasad Bharati Charitable Trust) ఆధ్వర్యంలో మీడియా రంగంలో సేవలు అందిస్తున్న వివిధ పత్రికల, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులను ఈ రోజు సంస్థ మేనేజింగ్ ట్రస్టి డాక్టర్ ఆడపు రాజేంద్రప్రసాద్(Dr. Adapu Rajendraprasad) ఘనంగా సన్మానించారు.
Charitable Trust | ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా
ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా సమస్యలు వెలికి తీసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రయోజనాలు జీతభత్యాలు ఉన్నా లేకున్నా మాట్లాడలేని వారి గొంతుకై సమస్యలు స్వచ్ఛందంగా సమాజానికి అందజేస్తున్నారని అన్నారు. సమాజానికి అనునిత్యం సేవలందిస్తున్న విలేకరులను గుర్తుంచుకొని సత్కరించడం అభినందనియమని అన్నారు.
Charitable Trust | సమాజ శ్రేయస్సు కోసం జర్నలిజం
సమాజ శ్రేయస్సు కోసం జర్నలిజం నిరంతర సేవలు అందిస్తుందని ఈ సందర్భంగా జర్నలిస్టులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జక్కుల విజయకుమార్(Jakkula Vijayakumar), బొట్ల స్వామిదాస్, డాక్టర్ పాలడుగుల సురేందర్, బావండ్ల పెళ్లి కిరణ్ కుమార్, ఆరే రమేష్ , బత్తులసత్యం తదితరులు పాల్గొన్నారు.
