Chariot Festival | జనసంద్రంగా మారిన అంజన్నరథోత్సవం

Chariot Festival | ఊర్కొండ, ఆంధ్రప్రభ : ఊరుకొండపేట అంజన్న స్వామి క్షేత్ర రథోత్సవం భక్తులతో జనసంద్రంగా మారింది. మండల పరిధిలో ఊరుకొండపేట అంజన్న స్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో జడ్చర్ల శాసనసభ్యుడు జనంపల్లి అనిరుద్ రెడ్డి ఈ రోజు అంజన్న స్వామి రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంజన్న క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది.

వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు క్యూ లైన్ల‌లో బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అవవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేవాలయ ఈవో సత్య చంద్రారెడ్డి, నాయకులు, అధికారులు, కల్వకుర్తి సర్కిల్ సిఐ నాగార్జున, ఎస్సై కృష్ణదేవ ఆధ్వర్యంలో ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply