Movie Clash | చరణ్, నాని.. తగ్గేదెవరు..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది. బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తోన్న ఈ భారీ చిత్రంలో చరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమాని మార్చి 27న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.

మరో వైపు నాని నటిస్తున్న మూవీ ప్యారడైజ్. దీనికి శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్. ఈ భారీ యాక్షన్ మూవీని మార్చి 26న విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. అంటే.. ఒక రోజు గ్యాప్ లో పెద్ది, ప్యారడైజ్ చిత్రాలు రిలీజ్ అవ్వడానికి(Movie Clash)రెడీ అవుతున్నాయి. మరి.. నిజంగానే ఈ రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్ లో వస్తాయా..? పోస్ట్ పోన్ అవుతాయా..? ఈ ఇద్దరిలో తగ్గేదెవరు..?

పెద్ది సినిమా అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ జరుపుకుంటుంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి ఇటీవల చికిరి చికిరి అంటూ సాగే పాట రిలీజ్ చేశారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సాంగ్ కి వచ్చిన పాజిటీవ్ ఫీడ్ బ్యాక్ తో టీమ్ మరింత స్పీడుగా వర్క్ చేస్తున్నారు.
గేమ్ ఛేంజర్ మూవీ నిరాశపరచడంతో రామ్ చరణ్.. పెద్ది సినిమాతో పెద్ద విజయం సాధించాలని తపిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Movie Clash | ఒదెలా ప్లాన్ ఏంటీ
ఇక ప్యారడైజ్ విషయానికి వస్తే.. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందుతోన్న మూవీ ఇది. వీరిద్దరి కాంబోలో వచ్చిన దసరా సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. దీంతో ఇప్పుడు మరోసారి ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో అనౌన్స్ చేసినప్పటి నుంచి పాజిటివ్ టాక్ ఉంది. అయితే.. చరణ్ పెద్ది రిలీజ్ కి ఒక రోజు ముందుగా ప్యారడైజ్ మూవీని రిలీజ్ చేస్తామని ప్రకటించడం అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. నాని.. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఆల్రెడీ అనౌన్స్ చేయడం కూడా జరిగింది.
మెగాస్టార్ తో సినిమా చేస్తున్న ఈ టైమ్ లో నాని, చరణ్ సినిమా పెద్దికి పోటీగా ఎందుకు ప్యారడైజ్ మూవీని రిలీజ్ చేస్తాడనేది అందరిలో ఉన్న ప్రశ్న. ఇప్పటి వరకు అయితే.. మాత్రం అటు పెద్ది, ఇటు ప్యారడైజ్ అనౌన్స్ చేసిన డేట్ కే వస్తామని.. తగ్గేదేలే అన్నట్టుగా ఈ రెండు చిత్రాల నిర్మాతలు చెబుతున్నారు. మరి.. నిజంగానే మార్చి 26న ప్యారడైజ్, మార్చి 27న పెద్ది థియేటర్స్ లోకి వస్తాయా..? లేక ఈ రెండింటిలో ఒక సినిమా పోటీ నుంచి తగ్గి పోస్ట్ పోన్ అవుతుందా..? అనేది క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

