ఇష్టరాజ్యంగా ఆరోపించడం తగదు…

చెన్నూర్, ఆంధ్రప్రభ : బిఆర్ఎస్ నాయకులు స్థాయికిమించి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ లను విమర్శిస్తే సహించేది లేదని సీనియర్ కాంగ్రెస్ నాయకులు హేచ్చరించారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. స్థానిక మాజీ కౌన్సిలర్ రెవెల్లి మహేష్ క్యాతనపల్లి మున్సిపల్ చెర్మెన్ ఎంపికలో జరుగుతున్నా వివిధ పరిణామాలకు మంత్రి వివేక్, ఎంపీ వంశీ కాంగ్రెస్ నాయకుల పై స్థాయినిమించి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు.

ఎన్నికల నియామవాళి ప్రకారం వెళుతున్న మంత్రి, ఎంపీ లపై ప్రత్యక్షంగా బాల్క సుమన్ దాడికి దిగారాని పేర్కొన్నారు. దానికి ఆధారాలతో చట్ట ప్రకారం పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటారని అన్నారు. ఒక రాష్ట్ర మంత్రి పై సోషల్ మీడియాలో ఇష్టరాజ్యంగా ఆరోపించడం తగదని, కాంగ్రెస్ నాయకులపై ఆరోపణలు చెస్తే ఉపేక్షేంచేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ లు అంబటి శంకర్, అజీమ్ నాయకులు చెన్నూరి శ్రీధర్, సుశీల్ కుమార్, చెన్నూరి రాజేష్, పెద్దింటి శ్రీనివాస్, సాధనబోయిన కృష్ణ, పాతర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply