ఇరువైపులా బోర్డుల మార్పు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌(Telangana Thalli Flyover)గా ఇటీవల జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నవిషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా మారుస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఫ్లైఓవర్‌కు ఇరువైపులా జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు కమాన్ ఏర్పాటు చేశారు.

1997లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. సచివాలయం నుంచి లోయర్ ట్యాంక్ బండ్ రహదారి ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం అప్ప‌ట్లో నిర్మించారు. అప్ప‌ట్లో “తెలుగు తల్లి ఫ్లైఓవర్”గా నామకరణం చేశారు. ఈ వంతెన అశోక్‌నగర్, ఇందిరానగర్ ప్రాంతాలను సికింద్రాబాద్‌తో అనుసంధానించడంలో కీలకంగా మారింది. లిబర్టీ నుంచి సచివాలయానికి వెళ్లే వాహనదారుల రద్దీ తగ్గింది. తెలంగాణ ఏర్పాటుతో తాజాగా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ దీనిని ‘తెలంగాణ తల్లి ఫ్లైఓవర్’గా మార్చేందుకు నిర్ణయించింది.

Leave a Reply