Chandrupatla | ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తాను..

Chandrupatla | ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తాను..

Chandrupatla, కల్లూరు, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ బలపరిచి, స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, రెవిన్యూ మంత్రివర్యులు పొంగులేటి. శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులతో చండ్రుపట్ల గ్రామ సర్పంచ్ బరిలో ఉన్న తనను గ్రామ ప్రజలందరూ కలిసి ఈ ఎన్నికలలో ఆశీర్వదిస్తే గ్రామాన్ని అన్ని రంగాలలో పెద్దల సహకారంతో పూర్తిస్థాయిలో అభివృద్ధి పరుస్తానని సర్పంచ్ అభ్యర్థిని బండి వాణి అన్నారు. శుక్రవారం ఆమె ఆంధ్రప్రభ విలేకరితో మాట్లాడుతూ.. స్వతహాగా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన తాను బాల్యం నుంచే ప్రజాసేవలో తమ తల్లిదండ్రులకు సహకారం అందించి పెరిగానని చెప్పారు.

గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తన విజయానికి బలమైన పునాదులని, తనను ఆదరించి గెలిపిస్తే, గ్రామంలో ఒక్క పూరిల్లు లేకుండా అందరికీ ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా పక్కా ఇల్లు నిర్మిస్తామని అన్నారు. రైతులకు కొత్త కుంటకు వెళ్లే రహదారి నిర్మిస్తానని, మాలపల్లి నుంచి స్మశాన వాటికకు వెళ్లేదారిని సీసీ రోడ్డుగా మారుస్తానని తెలిపారు. మొగలకుంట చెరువు కట్టపై రహదారి నిర్మాణం పనులు కూడా చేపడతామని అన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం ద్వారా గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి ప్రజలు తనకు అవకాశం కల్పించాలని తమ అమూల్యమైన ఓటు ముద్ర కత్తెర గుర్తు పై వేసి అఖండ విజయం చేకూర్చాలని గ్రామ ప్రజలను కోరారు.

Leave a Reply