రేపు ఏపీకి చంద్రబాబు

రేపు ఏపీకి చంద్రబాబు

నేటితో ముగియనున్న లండన్ పర్యటన


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లండన్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు పర్సనల్ టూర్ అని ప్రకటించినప్పటికీ.. ఏపీకి పెట్టుబడుల తీసుకువచ్చేందుకే వెళ్లారని సమాచారం. లండన్‌లో అనేకమంది దిగ్గజాలతో భేటీ అయ్యారు. భారత హైకమిషనర్ శ్రీ విక్రమ్ దొరైస్వామితో కూడా సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ – యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు చర్చలు జరిపారు. అయితే.. ఈ లండన్ పర్యటన పూర్తి చేసుకుని చంద్రబాబు రేపు ఉ.8:50కి హైదరాబాద్‌ చేరుకోనున్నారు. రేపు ఉ.9:50కి ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి.

Leave a Reply