Chandrababu | చేసే పనిలో బాధ్యత ఉండాలి

Chandrababu | చేసే పనిలో బాధ్యత ఉండాలి

కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు


Chandrababu | అమరావతి, ఆంధ్ర‌ప్ర‌భ : చేసే పనిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సు (Collectors Conference)లో సీఎం మాట్లాడారు. పలు అంశాలపై కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

మనం ఏ పనిచేస్తున్నా వివరాలు సమగ్రంగా ఉండాలని, అనుకున్న సమయానికి లక్ష్యాలు నెరవేరేలా అధికారులు కృషి చేయాలని చెప్పారు. నిరంతరం నేర్చుకునే పనిలోనే ఉండాలన్నారు. మంచి ఆలోచన ఎవరు ఇచ్చినా స్వీకరిద్దాం.. మెరుగైన ఫలితాలు (Better results) వచ్చే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాన‌న్నారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఎలా పనిచేస్తున్నాం అనేది ముఖ్యమ‌న్నారు. మనం చేసే పని వల్ల ప్రజలు మనతో కలిసి వస్తున్నారా? లేదా? అనేది గమనించాలన్నారు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కోర్టు కేసులను దాటుకుని కానిస్టేబుల్‌ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అంతకుముందు డీఎస్సీ పెట్టాం.. దానికి కూడా ఇలాగే గందరగోళం సృష్టించారు. బాధ్యత కలిగిన ప్రభుత్వమంటే అధికారాలు దుర్వినియోగం కాదు.. సద్వినియోగం కావాలన్నారు. అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందించే ప్రయత్నం చేస్తున్నామ‌ని చంద్రబాబు అన్నారు.

Leave a Reply