పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బత్తుల దీవెనకు బంగారు పతకం…

పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బత్తుల దీవెనకు బంగారు పతకం…

పాయకాపురం, ప్రభన్యూస్ : ప్రతిభ ఎవరి సొత్తుకాదని శివారు ప్రాంత బాలిక నిరూపించింది.విజయవాడ మైలవరంలో ఈనెల 22 తేదీన ఉమ్మడి కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల ఓపెన్ మరియు మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ (బెంచ్ ప్రెస్, స్క్వాట్, డెడ్ లిఫ్ట్) ఛాంపియన్‌షిప్ 2026 పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలలో బత్తుల దీవెన అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించింది. సబ్ జూనియర్, జూనియర్, మాస్టర్స్ టీమ్ సెలెక్షన్ పోటీల్లో భాగంగా నిర్వహించిన ఈ పోటీల్లో ఆమె ప్రత్యేక ప్రతిభ కనబరచింది.

47 కిలోల సబ్ జూనియర్ విభాగంలో పోటీ చేసిన దీవెన, క్రమశిక్షణతో కూడిన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె స్క్వాట్స్‌లో 70 కిలోలు, బెంచ్ ప్రెస్‌లో 20 కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 80 కిలోలు ఎత్తి మొత్తం 170 కిలోలు నమోదు చేసింది. ఈ ప్రదర్శనతో ఆమె ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకొని బంగారు పతకాన్ని సాధించింది.

దీవెనను ఉమ్మడి జిల్లాల పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు మల్లేష్, మారేళ్ళ వెంకటేశ్వరావు, బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సభ్యులు సి హెచ్. రాజు, తాళ్ళూరి అశోక్ ఘనంగా అభినందించారు. విజయంపై కోచ్‌ బి.మనోహర్, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు.

Leave a Reply