Champions Trophy | మరికాసేపట్లో ప్రారంభం కానున్న మినీ వరల్డ్ కప్ సంగ్రామం… తొలి మ్యాచ్ లో పాక్ తో కివీస్ ఢీ
అతిధ్యమిస్తున్న పాకిస్తాన్
తొలి మ్యాచ్ లో కివీస్ తో పాక్ ఢీ
ఎనిమిది జట్లతో చాంపియన్స్ ట్రోఫి
ఒక్క మ్యాచ్ ఓడిన గ్రూప్ నుంచి ఔట్
భారత్ మ్యాచ్ లన్నీ దుబాయ్ లోనే
రేపే బంగ్లాదేశ్ లో ఇండియా మ్యాచ్
23న దాయాదితో బిగ్ ఫైట్
కరాచీ: క్రికెట్ అభిమానులను ఆలరించేందుకు నేటి నుంచే పాకిస్తాన్ వేదికగా ఐసీసీ మెగా సమరం ఛాంపియన్స్ ట్రోఫీ 9వ ఎడిషన్ ప్రారంభమైంది. వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ మినీ వరల్డ్ కప్‌కు ఫుల్ క్రేజ్ ఉంది. నేడు మొదలయ్యే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (సీటీ)-2025 మార్చి 9న జరిగే ఫైనల్‌తో ముగియనుంది.
2017లో చివరిసారి ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించారు. ఆ తర్వాత కోవిడ్, ఇతర కారణాలతో ఈ మెగా ఈవెంట్‌ను ఐసీసీ కొనసాగించలేక పోయింది. కానీ, ఇప్పుడు దాదాపు 8 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు అంత ర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి నడుం బిగించింది. ఈ మ్యాచ్ ఆతిథ్య హోదాను డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ దక్కించుకుంది. తొలి మ్యాచ్ అతిథ్య దేశం పాకిస్తాన్ బ్లాక్ క్యాప్స్ న్యూజీలాండ్ తో తలపడనుంది
ఇక ఈ మెగా టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-ఎలో భారత్‌తో పాటు డిఫెండింగ్ ఛాంపి యన్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. అలాగే గ్రూప్-బి లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్ జట్లు పోటీ పడుతు న్నాయి. గ్రూప్ దశలో అన్ని జట్లు తమ గ్రూప్‌లోని జట్లతో ఒకసారి తలపడతాయి. ఆ తర్వాత రెండు గ్రూపుల నుంచి తలో 2 జట్లు సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.
మ్యాచ్‌లు ఎక్కడ జరగనున్నాయి?
2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో, మొత్తం 4 స్టేడియాలలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో పాకిస్తాన్ నుంచి 3 స్టేడియంలు, దుబాయ్ నుంచి 1 స్టేడియాన్ని ఎంపిక చేశారు. పాకిస్తాన్‌లో, కరాచీలోని నేషనల్ స్టేడియం, లాహోర్‌లోని గడాఫీ స్టేడియం, రావల్పిండిలోని రావల్పిండి క్రికెట్ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతాయి. దుబాయ్‌లో, టీం ఇండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడుతుంది. ఈ టోర్నమెంట్‌లో అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి. టాస్ మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది.
టైటిల్ ఫేవరేట్ గా టీమ్ ఇండియా..
కొద్ది కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనలు చేస్తున్న టీమిండియా ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ జరగగా.. అందులో భారత్ రెండు సార్లు విజేతగా నిలిచింది. ఇప్పుడు మూడో టైటిలే లక్ష్యంగా రోహిత్ సేన ఈ మెగా పోరుకు సిద్ధమైంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా రెండు సార్లు సీటీ టైటిళ్లను సొంతం చేసుకుంది. పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలు కూడా చెరొక సారి విజేతగా నిలిచారు.
టీం ఇండియా మ్యాచ్‌ల షెడ్యూల్..
టీం ఇండియా ఈ నెల 20న తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఆ తర్వాత టీం ఇండియా తన రెండో మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగుతుంది. ఆ తర్వాత, గ్రూప్‌లో తన చివరి మ్యాచ్‌లో, మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఆ తరువాత సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.
న్యూజిల్యాండ్ తో పాక్ ఢీ..
ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభపు మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్, న్యూజి లాండ్ జట్లు తడపడుతున్నాయి..ఇక ఈ మ్యాచ్ లో . డిఫెండింగ్ ఛాంప్ పాకిస్తాన్ తమ హోమ్ గ్రౌండ్స్‌లో ఆడుతుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. పాక్‌ను వారి సొంత గడ్డపై ఓడించడం ఏ జట్టుకైన పెద్ద సవాలే. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభా గాల్లో పాక్ టీమ్ పటిష్టంగా ఉంది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, మాజీ సారథి బాబార్ ఆజమ్, ఫఖర్ జమాన్, సౌద్ షకీల్, ఉస్మాన్ ఖాన్, తయ్యబ్ తాహీర్‌లతో కూడిన బ్యాటింగ్ ఆర్డర్ ఎలాంటి బౌలింగ్ లైనప్‌నైనా ఈజీగా చిత్తు చేయగలదు. అలాగే బౌలింగ్‌లో నసీమ్ షా, షాహిన్ షా అఫ్రిదీ, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్ లతో పాటు ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ ఆఘా లాంటి ప్రమాదరకమైన ఆల్‌రౌండర్లు ఉండటం పాక్‌కు అదనపు బలం.
ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే.. ఈ జట్టు కొద్దికాలంగా పెను సంచలనాలు సృష్టి స్తోంది. తమ సొంత మైదనాల్లోనే కాకుండా విదేశీ పర్యటనలలోనూ చిరస్మరణీయ విజ యాలు సాధిస్తూ ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపె డుతుంది. ఇటీవల పాకిస్తాన్‌లో జరిగిన త్రై పాక్షిక సిరీస్‌ను కూడా న్యూజిలాండ్ గెలుచుకుంది. ఫైన ల్లో ఆతిథ్య పాకిస్తాన్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడిన కివీస్ పాకిస్తాన్‌ను రెండు సార్లు, దక్షిణాఫ్రికాను ఒక సారి ఓడిం చింది. ఇక ఈ జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదువేలేదు. బ్యాటిం గ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో కివీస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కాగా, ఆ జట్టు స్టార్ పేసర్ ఫెర్గ్యూసన్ గాయంతో చివరి నిమిషంలో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో కైల్ జామిసన్ కివీస్ జట్టులో చేరాడు. మొత్తంగా ఇరుజట్లు ఈ మ్యాచ్‌లో తమ పూర్తి స్థాయి బలబలగాలతో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. రెండు జట్లలో కూడా స్టార్ ఆటగాళ్లు ఉండటంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయం.
జట్ల వివరాలు (స్క్వాడ్‌లు)
పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, బాబార్ ఆజమ్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అఘా, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, ఉస్మాన్ ఖాన్, మహ్మద్ హస్‌నైన్, షాహిన్ షా అఫ్రిదీ, నసీమ్ షా.
న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మ్యాట్ హెన్రీ, విల్ ఓ రూర్కే, నాథన్ స్మిత్, విల్ యంగ్, జాకబ్ డఫీ, మైఖేల్ బ్రేస్‌వెల్, కైల్ జెమీషన్.