Champions Trophy | పాక్ మూడో వికెట్ డౌన్ !
- కెప్టెన్ రిజ్వాన్ కు షాక్ ఇచ్చిన అక్షర్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ వికెట్లు నష్టపోకుండా ఆడుతూ స్కోరు బోర్డుకు మెల్లిగా ముందుకు కదుపుతోంది. అయితే, టీమిండియా పటిష్ట బౌలింగ్ ను ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మరో వికెట్ కోల్పోయింది. 33.2 ఓవర్లలో పాక్ కెప్టెన్ రిజ్వాన్‌ను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. 77 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్ 46 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
ఇక ప్రస్తుతం క్రీజులో సౌద్ షకీల్ (62) – అఘా సల్మాన్ ఉన్నారు. పాకిస్థాన్ స్కోర్ 34.3వ ఓవర్లకు 159/3.