దుబాయ్ : ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా అఖండ విజయం సాధించింది. దుబాయి స్టేడియం వేదకిగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో భారత జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఫైనల్స్ ఓవర్లలో నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో.. టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయతీరాలకు చేరుకుంది. ఈ టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరిన రోహిత్ సేన… అజేయంగా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 251/7 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా లక్ష్యాన్ని 49 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ రోహిత్ (76) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ (31), శ్రేయస్ అయ్యార్ (48) రాణించారు. అక్షర్ (29), హార్దిక్ పాండ్యా (18) పరుగులు చేశారు.
ఆఖరి ఓవర్ వరకు ఒత్తిడిని తట్టుకుని నిలబడిన కేఎల్ రాహుల్ (34 నాటౌట్) తన ఆకట్టుకున్నాడు. రవీంద్ర జడేజా విన్నింగ్ బౌండరీతో టీమ్ ఇండియా సంబరాల్లో మునిగిపోయింది.
భారత్ ఖాతాలో మూడో ఛాంపియన్స్ ట్రోఫీ
ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి తమ ఖాతాలో మూడో ఛాంపియన్స్ ట్రోఫీ వేసుకుంది భారత్ జట్టు. మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న తొలి జట్టుగా భారత్ నిలిచింది.2002లో శ్రీలంకతో కలిసి ట్రోఫీని పంచుకోగా.. 2013లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో టైటిల్‌కు దక్కింది. ఇప్పుడు రోహిత్ శర్మ మరో సారథ్యంలో మూడో ట్రోఫీ దక్కింది.
ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో భారత్‌పై న్యూజిలాండ్ (3-1) పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది.
ఇప్పటి వరకు ఇరు జట్లు ఐసీసీ ఫైనల్స్‌లో నాలుగు సార్లు ముఖాముఖీగా తలపడగా.. అందులో న్యూజిలాండ్ ఏకంగా మూడు సార్లు విజేతగా నిలిచి ఐసీసీ ట్రోఫీలను ఎగురువేసుకుపోయింది. భారత్ మాత్రం ఒకేసారి నెగ్గింది.
37 ఏళ్ల కిందట భారత్ చివరిసారి న్యూజిలాండ్‌ను ఫైనల్లో ఓడించింది. అప్పటి నుంచి టీమిండియా మరో విజయం కోసం ఎదురుచూస్తునే వుంది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గెలిచి ఆ ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా.
కాగా, 1998లో షార్జా వేదికగా జరిగిన ఐసీసీ ప్రముఖ టోర్నీ షార్జా కప్ ఫైనల్లో భారత్-న్యూజిలాండ్ మొదటి సారి తలపడ్డాయి. ఈ ఫైనల్లోటీమిండియా ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మన జట్టును గెలిపించాడు.
తర్వాత 2000లో ఇరు జట్లు నాకౌట్ టోర్నీ (ఛాంపియన్స్ ట్రోఫీ) ఫైనల్లో పోటీపడ్డాయి. అయితే ఆ మ్యాచ్‌లో మాత్రం న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి ట్రోఫీ కైవసం చేసుకుంది. అనంతరం 2005 ముక్కోనపు సిరీస్ ఫైనల్లోనూ టీమిండియాపై కివీస్ గెలిచింది. ఆ తర్వాత 2021లో భారత్, న్యూజిలాండ్ జట్లు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తలపడ్డాయి. తొలిసారి జరిగిన ఈ ఫైనల్లో కివీస్ ఛాంపియన్‌గా అవతరించింది.