Champions Trophy – ఆసీస్ అలౌట్ … భారత్ టార్గెట్ ఎంతంటే

దుబాయ్ – చాంపియ‌న్స్ ట్రోఫీ తొలి సెమీస్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 264 పరుగులకు అలౌట్ అయింది. భారత్ ఫైనల్స్ కు చేరాలంటే 265 పరుగులు చేయాల్సి ఉంది. చివరి వికెట్ హర్ధిక్ పాండ్యాకు దక్కింది.. 7 పరుగులు చేసిన జంపాను పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు. అంతకు ముందు తొమ్మిదో వికెట్ రూపంలో 10 ప‌రుగులు చేసిన ఎలీస్ ను ష‌మీ ఔట్ చేశాడు.. ష‌మీకి ఈ మ్యాచ్ లో మూడో వికెట్ .. ఇక ఎనిమిదో వికెట్ గా 60 ప‌రుగులు చేసిన అడ‌మ్ క్యారీ వెనుతిరిగాడు… హ‌ర్ధిక్ పాండ్యా త్రోకి ర‌నౌట్ గా క్యారీ వెనుతిరిగాడు . ఇక 19 ప‌రుగులు చేసిన బెన్ డ్వారిషూస్ ను వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్ లో ఏడో పెవిలియ‌న్ కు చేరాడు.
స్కీపర్ స్టీవ్ స్మిత్ వికెట్ ను కోల్పోయింది. ఆ వెంటనే గ్లెన్ మ్యాక్స్ వెల్ వికెట్ నూ పోగొ్ట్టుకుంది.73 పరుగులు చేసిన స్మిత్ ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు.. దీంతో ఆసీస్ అయిదో వికెట్ కోల్పోయింది.. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్ వెల్ ను అక్షర్ పటేల్ పెవిలియన్ కు పంపించాడు.మ్యాక్స్ వెల్ 7 పరుగులు చేశాడు. అంతకు ముందు నాలుగో వికెట్ జోస్ ఇంగ్లిస్ రూపంలో కోల్పోయింది.. 11 ప‌రుగులు చేసిన ఇంగ్లీస్ ను జ‌డేజా పెవిలియ‌న్ కు చేర్చాడు. ఈ మ్యాచ్ లో జ‌డేజాకు ఇది రెండో వికెట్ .. ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లబూషేన్ 29 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో మూడో వికెట్ గా పెవిలియన్ కు చేరుకున్నాడు. అంత‌కు ముందు వరుణ్ చక్రవర్తి తొలి ఓవ‌ర్ లోనే ట్రావీస్ హెడ్ ను రెండో వికెట్ కి పెవిలియ‌న్ కు పంపించాడు. 39 పరుగులు చేసిన ట్రావీస్ హెడ్ వ‌ర‌ణ్ బౌలింగ్ లో గిల్ క్యాచ్ ప‌ట్ట‌డంతో ఔట‌య్యాడు..ఇక ఇండియాతో జ‌రుగుతున్న సెమీస్ మ్యాచ్ లో ఆదిలోనే ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ‌త‌గిలింది.. కూప‌ర్ సున్నా ప‌రుగుల‌కే ష‌మీ బౌలింగ్ లో ఔట‌య్యాడు.. ఈ వికెట్ ష‌మీకి ల‌భించింది.. ఇక తొలి ఓవ‌ర్ లోనే ట్రావిస్ హెడ్ లైఫ్ ల‌భించింది. ష‌మీ త‌న బౌలింగ్ లోనే రిట‌ర్న్ క్యాచ్ ప‌ట్టుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు.
షమీకి మూడు, హర్ధిక్ పాండ్యా కు ఒకటి , వరణ్ చక్రవర్తికి రెండు,అక్షర్ పటేల్ కు ఒకటి, రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు లభించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *