ప్రారంభించిన చైర్మన్ బీఆర్ నాయుడు

ప్రారంభించిన చైర్మన్ బీఆర్ నాయుడు

  • బ్రహ్మోత్సవాల కవరేజిలో పాల్గొనే మీడియాకు
  • అవసరమైన సౌకర్యాలతో సెంటర్ ఏర్పాటు
  • 9 రోజుల పాటు మీడియా ప్రతినిధులకు
  • హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం, భోజన వసతి


వెబ్ డెస్క్, తిరుమల : మీడియా ప్రారంభం సందర్భంగా తిరుమల చైర్మెన్ బీఆర్ నాయుడు (BR Naidu) మాట్లాడుతూ… పుష్ప ప్రదర్శశాల చాలా అద్భుతంగా ఉందని, ప్రతి ప్రదర్శనను ఒక కళాఖండంగా తీర్చిదిద్దారని, ఒక మీడియా ప్రతినిధిగా…తిరుమలలో మీడియా సెంటర్ ప్రారంభించడం కలలో కూడా ఊహించలేదని, తిరుమల (Tirumala) లో మీడియాకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, బ్రహ్మోత్సవాలలో మీడియా పాత్ర చాలా కీలకమన్నారు.

ఇంత పెద్ద వ్యవస్థలో చిన్న చిన్న లోపాలువ తలెత్తడం సహాజమని….వాటిని పెద్దగా చేసి చూపవద్దని పాత్రికేయూకు సూచించారు.
బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా మీడియా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు చైర్మెన్. సమస్యలేవైనా ఉంటే టీటీడీ యంత్రాంగం దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని, ఉత్సవాలు విజయవంతం చేయడానికి మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేసారు.

Leave a Reply