chahal | ఇప్పుడు ఆట పైనే ఫోక‌స్‌

chahal | ఇప్పుడు ఆట పైనే ఫోక‌స్‌

chahal |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : టీమిండియా వెటరన్ స్పిన్నర్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ త‌న ఆట కంటే ఇత‌ర విష‌యాల ద్వారా ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తుంటాడు. ప్ర‌ధానంగా ధనశ్రీ వర్మతో విడాకులు పెద్ద దుమారం రేపింది. విడాకుల త‌ర్వాత చాహ‌ల్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన యుజ్వేంద్ర చాహల్ మద్యానికి బానిసైనట్లు వార్తలు వచ్చాయి. అతను బాగా తాగి తూగుతూ ఉన్న వీడియో కూడా అప్పట్లో వైరల్‌గా మారింది. అయితే నేను కంప్లీట్‌గా మారిపోయా.. మందు మానేశా.. అని చాహ‌ల్ పేర్కొటున్నాడు.

ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాను, నేను మద్యం మానేసి 6 నెలలకు పైగా అవుతుంది. ఇప్పుడు నా వయసు 35 ఏళ్లు. నేను మరింత ఫిట్‌గా ఉంటూ నా జట్టుకు 150 శాతం సహకారం అందించాలనుకుంటున్నా. ఒక సీనియర్ ఆటగాడిగా.. కుర్రాళ్లకు ఆదర్శంగా ఉండాలనుకుంటున్నాను అని చాహ‌ల్ అన్నాడు. గతేడాది తృటిలో చేజారిన ఐపీఎల్ టైటిల్‌ను ఈసారి అందుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో చాహల్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన స్పిన్నర్‌గా చాహల్ చరిత్రకెక్కాడు.

ఐపీఎల్ 2025 సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ అద్వితీయమైన ప్రదర్శనతో ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆర్‌సీబీతో జరిగిన ఫైనల్లో ఓడి తృటిలో టైటిల్ కోల్పోయింది.

Leave a Reply