Certificates | పోటీ పరీక్షల్లో…

Certificates | పోటీ పరీక్షల్లో…
Certificates | వేల్పూర్, ఆంధ్రప్రభ : మండల స్థాయి తెలుగు ప్రతిభాపాటవ పోటీ పరీక్ష రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జమీలుల్ల, రమణాచారి, సూచనల మేరకు శుక్రవారం వేల్పూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మండల ఉన్నత పాఠశాలల స్థాయి తెలుగు ప్రతిభాపాటవ పోటీ పరీక్ష” నిర్వహించారు. ఈ పోటీ పరీక్షలో మొదటి స్థానంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామన్నపేట్ విద్యార్థులు జి.లక్ష్మీ ప్రసన్న, కే.శ్రీనితలు మొదటి స్థానంలో నిలిచారు.
రెండవ స్థానంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పచ్చల నడుకుడ విద్యార్ధిని యశస్విని, మూడవ స్థానంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతె విద్యార్థిని నవ్య నిలిచారు. గెలుపొందిన విద్యార్థులకు మండల తెలుగు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాజన్న సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కే శివాజీ, కాంప్లెక్స్ సెక్రటరీ భాగ్యలక్ష్మి, మండల తెలుగు భాషోపాధ్యాయులు కత్తి, శ్యాంచరణ్, పతాని గంగాధర్, కాంతయ్య, శ్రావణ శ్రీ, వీణ, నాగపుష్పలత, కళ్యాణి తదితరులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు..
