Certificate | జిల్లాస్థాయి ఉత్తమ ఆర్డీవోగా శేఖర్ రెడ్డి …

Certificate | జిల్లాస్థాయి ఉత్తమ ఆర్డీవోగా శేఖర్ రెడ్డి …
- ప్రభుత్వ విప్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆర్డీవో శేఖర్ రెడ్డి
Certificate | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి లో విశిష్ట సేవలు అందించిన చౌటుప్పల్ ఆర్డిఓ వెలమ శేఖర్ రెడ్డి ఉత్తమ ఆర్డీవో గా ఎంపికయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ రోజు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వాడు ఉత్తమ అధికారిగా ఎన్నికైన ఆర్డీవో శేఖర్ రెడ్డిని అభినందిస్తూ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు ల చేతుల మీదుగా అవార్డును అందజేయడంతో పాటు ప్రశంసా పత్రం ను అందజేశారు.
అదేవిధంగా చౌటుప్పల్ మండల తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ గిర్దావరి గా పనిచేస్తున్న కొప్పుల సుధాకర్ రావును జిల్లా స్థాయి ఉత్తమ రెవెన్యూ గిర్ధావరి గా ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా అవార్డును, ప్రశంసా పత్రంను అందజేశారు. అదేవిధంగా ఉత్తమ ఏపీఎంగా ఉరిపాకల యాదయ్యను ఎంపిక చేయిస్తూ జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా అవార్డును, ప్రశంసా పత్రమును అందజేశారు.

చౌటుప్పల్ డివిజన్ పరిధిలోని రామన్నపేట మండల తాహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న కట్ట గాలయ్య జిల్లాస్థాయి ఉత్తమ సీనియర్ అసిస్టెంట్ గా ఎంపిక కావడంతో జిల్లా కలెక్టర్ హనుమంతరావు గాలయ్యను అభినందిస్తూ ఉత్తమ అధికారిగా అవార్డును, ప్రశంసా పత్రం ను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కరరావు, జిల్లా ఎస్పీ అక్షాంష్ తదితరులు పాల్గొన్నారు.
