ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా…

ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా…
ఇంటర్ (సైన్స్) తరగతి ప్రారంభం…
సత్తెనపల్లి రూరల్, ఆంధ్రప్రభ : సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపాల్ జగదీశ్ కుమార్ గుప్తా ఎంపీ, ఎమ్మెల్యే లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పీఎం శ్రీ కేంద్రియ విద్యాలయ సత్తెనపల్లి విద్యా రంగంలో నిరంతరం అభివృద్ధి సాధిస్తూ ఒక కొత్త గుర్తింపును ఏర్పరుచుకుంటోంది. ఇటీవల పాఠశాలలో ఒక ముఖ్యమైన సాధనగా, స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ కృష్ణదేవరాయలు (ఎంపీ) స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ అహర్నిశ కృషి, సహకారంతో ఇప్పుడు పాఠశాలలో ఇంటర్మీడియట్ (11వ) తరగతి (సైన్స్) ప్రారంభం చేయబడుతోంది.
ఈ సందర్బంగా ఈ ప్రాంత విద్యార్థులకు ఎంతో ముఖ్యమైన, అభినందనీయమైన విషయం. దీని ద్వారా విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, తమ ప్రాంతంలోనే మెరుగైన విద్యా అవకాశాలను పొందగలుగుతారని గుప్తా పేర్కొన్నారు. అలాగే, 3వ, 4వ, 5వ తరగతుల్లో డబుల్ సెక్షన్లు ప్రారంభించబడ్డాయి. ఈ చర్యతో మరింత మంది విద్యార్థులకు నాణ్యమైన, సులభమైన విద్య అందుబాటులోకి వస్తుంది. ఈ విజయానికి గాను ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు కు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగదీష్ గుప్తా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
