దెబ్బతిన్న పంటల పరిశీలనకు ..
బిక్కనూర్, అక్టోబర్ 8 (ఆంధ్రప్రభ) : కామారెడ్డి జిల్లా (Kamareddy District)లో కేంద్ర బృందం సభ్యులు బుధవారం పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లతో పాటు పంటలను బృందం సభ్యులు పరిశీలించారు. జిల్లాలోని మొదటగా బిక్కనూర్ మండల కేంద్రంలో దాసరమ్మ కుంట ను పరిశీలించారు. అక్కడ తెగిపోయిన రోడ్డును పరిశీలించి పలు వివరాలు సేకరించారు. అనంతరం అక్కడే వరద నీటికి కొట్టుకపోయినా వరి పంటలను బృందం సభ్యులు పరిశీలించారు.
అక్కడి నుండి అంతంపల్లి గ్రామ శివారులో గల ఎడ్ల కట్ట వాగును సందర్శించారు. అక్కడ ప్రవహిస్తున్న నీటిని చూశారు. భారీ వర్షాల (Heavy rains) వల్ల దెబ్బతిన్న పంటల వివరాలను ఫోటో రూపంలో వ్యవసాయ అధికారులు బృందం సభ్యులకు చూపించారు. జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను పూర్తిస్థాయిలో సభ్యులు తెలుసుకున్నారు. అనంతరం బిబిపేట మండల కేంద్రంలో వారు పర్యటించారు. అక్కడ తెగిపోయిన రోడ్డును పరిశీలించి అధికారులకు కొల సలహాలు సూచనలు అందజేశారు. భారీ వర్షాల వల్ల కామారెడ్డి జిల్లాలో జరిగిన ఆస్తి నష్టాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ బృందం సభ్యులకు తెలియజేశారు. వారి వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు.