Center | ఉత్సవరాట ప్రతిష్ట..
Center | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ (Gudivada) పట్టణం ఓల్డ్ మున్సిపల్ కార్యాలయ సెంటర్లో శ్రీ కోదండ రామాలయంలో 81 వ వార్షిక ధనుర్మాస ఉత్సవాల రాట ప్రతిష్టా పూజా కార్యక్రమాలు శనివారం శాస్త్రోక్తంగా జరిగాయి. వేద పండితుడు శ్రీకాంత్ మంత్రోచ్ఛరణల మధ్య దేవస్థానం కమిటీ పెద్దలు, భక్తులు ఉత్సవరాటను ప్రతిష్టించారు.
ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ పెద్దలు మాట్లాడారు. లారీ (Lorry) ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ గత 80 ఏళ్లుగా శ్రీ కోదండ రామాలయంలో పెద్ద ఎత్తున ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయన్నారు. మన సాంప్రదాయ కళాకారులను ప్రోత్సహిస్తూ, నిర్వహించే ఉత్సవాల్లో భక్తులు, పట్టణ ప్రజలు, పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ పెద్దలు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ (Muncipal) మాజీ ఛైర్మన్ లంకదాసరి ప్రసాదరావు, దేవస్థాన కమిటీ అధ్యక్షుడు డొక్కు రాంబాబు, లారీ ఓవర్ అసోసియేషన్ అధ్యక్షుడు గుత్తా చంటి, కార్యదర్శి రాయపురెడ్డి ప్రసాద్, అసోసియేషన్ పెద్దలు మురిగిమాల రామకృష్ణ, పోలగాని కృష్ణ, భక్తులు, దేవస్థాన పరిసర ప్రాంతాల వ్యాపార వాణిజ్య సముదాయాల నిర్వాహకులు పాల్గొన్నారు.

