Centenary | ఘనంగా వాజ్ పేయ్ శతజయంతి

Centenary | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయ్ శతజయంతి ఉత్సవాలను ఇవాళ పార్టీ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పనా ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈసందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు రమణగోని శంకర్ మాట్లాడుతూ… అటల్ బిహారీ వాజ్ పేయ్ ఎన్నో సంస్కరణలు దేశానికి అందించి గొప్ప రాజనీతి యోగ్యతను చాటుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బత్తుల జంగయ్య గౌడ్, చౌటుప్పల్ మండల కమిటీ ఉపాధ్యక్షులు పర్నే శ్రీను రెడ్డి, మున్సిపల్ మాజీ ప్రధాన కార్యదర్శి కడారి ఐలయ్య యాదవ్, తూర్పునూరి నరసింహ, 29వ బూత్ అధ్యక్షులు ఇటికాల దామోదర్ రెడ్డి, 30వ బూత్ అధ్యక్షులు బత్తుల మహేష్, ఎర్రగోని సత్యనారాయణ, వెంకట్ రెడ్డి, బొడ్డు మల్లేశం యాదయ్య ముత్తయ్య, కొంతం స్వామి, నన్నూరి కార్తీక్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, పర్నే శివారెడ్డి, పర్నే భరత్ రెడ్డి, బాతరాజు లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.
