కే.కొత్తపాలెంలో సిసి రోడ్డు పనులు..

కే.కొత్తపాలెంలో సిసి రోడ్డు పనులు..
మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవి మండలంలోని కె.కొత్తపాలెం గౌడ పాలెంలో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ కొక్కిలిగడ్డ మాధవి, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి రావి రత్నగిరి, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు లు కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.

కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని గౌడ పాలెం లో 165 మీటర్లు పొడవున, రూ 10.65 లక్షలు అంచనాతో రహదారి నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది.2024-2025 సంవత్సరంలో సంభవించిన కృష్ణానది వరదల కారణంగా అవనిగడ్డ శాసనసభ్యులు మండల బుద్ద ప్రసాద్ కరకట్ట దిగువున నూరు శాతం సిమెంట్ రోడ్లు నిర్మించాలన్న సంకల్పంతో పల్లె పండుగ లో భాగంగా సిమెంట్ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయటం జరిగింది.
రహదారి నిర్మాణం లో గత కొంతకాలంగా అవాంతరాలు ఏర్పడటంతో తాత్కాలికంగా ఆలస్యం కావడం జరిగింది. ప్రస్తుతం ఏర్పడిన అవాంతరాలను అధిగమించి నిర్మాణ పనులు ప్రారంభించినట్లు సర్పంచ్ తెలియజేశారు. నాగాయితిప్ప పిఏసిఎస్ చైర్ పర్సన్ బల్లా సీతారామ ప్రసాద్, టిడిపి నాయకులు, డోకిపర్తి బాల కోటేశ్వరరావు, పడమట వెంకటేశ్వరరావు, చందన అనిల్, దుట్టా శేషు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫణికుమార్ తదితరులు ఉన్నారు
