CBN Happy  : ఆ కిక్కే వేరబ్బా Andhra Prabha News

CBN Happy  : ఆ కిక్కే వేరబ్బా Andhra Prabha News

టీమ్​ వర్క్​ చాలా బాగుంది

మంచి ఫలితాలు సాధించాం

2026లోనూ మరింత ఉత్సాహంతో సాగుదాం

విద్యుత్తు రంగంలో అద్భుత ఫలితాలు

భారీ పరిశ్రమలు వచ్చాయ్​

ఉపాధికి ఢోకా లేదు

కీప్​ ఇట్​ అప్​,.. ఎస్ఐపీబీ భేటీలో ఏపీ సీఎం

( ఆంధ్రప్రభ, వెలగపూడి ప్రతినిధి )

CBN Happy

 2025లో సక్సెస్​  కోసం  అందరూ అద్భుతంగా పని చేశారు. సక్సెస్ (Success)   ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుంది… ఆ కిక్ (Kick)  కోసం అందరూ పని చేయాలి, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ (Speed of Delivary)  గవర్నెన్సులో ఫలితాలు రావాలనే లక్ష్యంతో పని చేయాలి, అపి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు   అన్నారు. వెలగపూడి  సచివాలయంలో మంగళవారం  సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ ఐ పీ బీ సమావేశం జరిగింది.

CBN Happy

గత 13 సమావేశాల్లో  ₹ 8.55 లక్షల కోట్ల పెట్టుబడులకు, ₹  8.23 లక్షల ఉద్యోగ అవకాశాలకు (Employment)   ఎస్ఐపీబీ (SIPB)  ఆమోదం తెలిపింది. 14వ ఎస్ఐపీబీ సమావేశంలో   పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో వివిధ పెట్టుబడులను ఆమోదం తెలపనుంది. ఈ సమావేశంలో  మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, నారాయణ, టీజీ భరత్, కందులు దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు  పాల్గొన్నారు.

CBN Happy

ఈ సందన్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 2025 ఏడాదిలో పెట్టుబడులు (Investments)  అద్భుతంగా వచ్చాయని… అదే ఉత్సాహంతో 2026 లోనూ  పనిచేయాలని సీఎం సూచించారు. రాష్ట్రాభివృద్ధికి మంత్రులు, అధికారులు అద్భుతంగా పని చేశారని ఆయన కితాబు ఇచ్చారు. గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ (Come back Brand)  తిరిగి వచ్చింది.

CBN Happy

రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి. టాటా, (TATA) జిందాల్ (JINDAL),  బిర్లా, అదానీ, రిలయెన్స్, టీసీఎస్, (Tcs)  కాగ్నిజెంట్ (Cognizant)  వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయి. ఏ చిన్న పొరపాటు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలి, అని సీఎం చంద్రబాబు (CBN Happy)  అన్నారు.

CBN Happy

CBN Happy :  టీమ్​  వర్క్​ తోనే సక్సెస్​ 2025లో అంతా కలిసి టీమ్ వర్క్ (Team Work)  చేశాం. మంచి  (Good Results)  ఫలితాలు వచ్చాయి. విద్యుత్ రంగంలో అద్భుతంగా పనిచేశాం. 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించాం. ₹ 4500 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించాం. విద్యుత్ కొనుగోళ్ల ధరలను కూడా తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

CBN Happy

2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను ₹ 3.70 కు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూడడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది, అని సీఎం హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ రంగంలో   కృషి వల్లే డేటా సెంటర్లు వచ్చాయి. విద్యుత్ రంగంతోపాటు… వివిధ రంగాల్లో పెట్టుబడులు బాగా వచ్చాయి. దావోస్ సదస్సుకు వెళ్లాం ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేయగలిగాం… విదేశీ కంపెనీలను ఆకర్షించగలిగాం.గూగుల్ సెంటర్ ఏపీకి తీసుకురావడానికి లోకేష్ కృషి చేశారు, సీఎం వివరించారు. 

also read : CBN Call  :    గట్టు  గొడవలొద్దు Andhra prabha  RT News

Leave a Reply