cbn 2047 vison : అప్పుడు విధ్వంసం Andhta Prabha Assebly News

cbn 2047 vison : అప్పుడు విధ్వంసం Andhta Prabha Assebly News

  • ఇప్పుడు వికాసం
  • ఏపీ భవిష్యత్తుపై ఏపీ సీఎం ఫోక‌స్
  • పోలవరం, అమరావతి, పెట్టుబడులపై క్లారిటీ
  • స్వర్ణాంధ్ర-2047 లక్ష్యం..
  • ఏపీ అభివృద్ధిపై బిగ్ ప్లాన్
  • రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు..
  • 23 లక్షల ఉద్యోగాలు.. ఏపీ సీఎం కీల‌క‌ ప్రకటన
  • పోలవరం పూర్తి.. అమరావతి అభివృద్ధి..
  • అసెంబ్లీలో ఏపీ సీఎం రోడ్ మ్యాప్
  • ఏపీ పునర్నిర్మాణం.. సీఎం స్వర్ణాంధ్ర విజన్
  • విపక్షం గైర్హాజరు…
  • ప్రజల ఆకాంక్షలపై చర్చించాం
  • రూ.3.32 లక్షల కోట్లతో అభివృద్ధి లక్ష్యం
  • 2047 స్వర్ణాంధ్ర విజన్…
  • అభివృద్ధికి కొత్త లక్ష్యాలు
  • వికసిత్ భారత్ – స్వర్ణాంధ్ర 2047 సంకల్పం
  • అసెంబ్లీ ఏక గ్రీవ తీర్మానం

( ఆంధ్ర‌ప్ర‌భ‌, ఏపీ న్యూస్ నెట్ వ‌ర్క్ ప్ర‌తినిధి )

ఏపీ శాసనసభలో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, పెట్టుబడులు, ఉద్యోగాలు, జల్ జీవన్ మిషన్ వంటి అంశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వివరించారు. అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడుతూ.. గడచిన 15 రోజులుగా శాసనసభలో ఐదు కోట్లమంది ప్రజల భవిష్యత్తు గురించి చర్చలు చోటు చేసుకున్నాయి. భావితరాల భవిష్యత్ నిర్ణయించేలా ఈ సమావేశాల్లో చర్చలు, నిర్ణయాలు జరిగాయి. విపక్ష పార్టీ సభకు హాజరు కాకుండా ప్రజా సమస్యల్ని వదిలేసినా 5 కోట్ల ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఇక్కడ చర్చించాం. అని సీఎం చంద్ర‌బాబు అన్నారు.

cbn 2047 vison : కూట‌మిని ప్ర‌జ‌లు న‌మ్మారు

cbn 2047 vison

విభజన వల్ల, గత పాలకుల విధ్వంసం వల్ల నష్టపోయిన ఏపీని పునర్నిర్మాణం చేసుకుంటున్నాం . డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ సహకారంతో కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజలకు మేలు చేస్తున్నాం.గత ఎన్నికల్లో నిలబెట్టిన అభ్యర్ధుల్లో 94 శాతం మంది గెలవటం మా అందరిపైనా ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఎన్డీఏ పక్షాలన్నీ పూర్తి సఖ్యతతో ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం . తీవ్ర అగమ్య గోచరంగా మారిపోయిన రాష్ట్ర భవిష్యత్తును తిరిగి నిర్మించేలా, గట్టెక్కించే బాధ్యత తీసుకున్నాం . రూ.3.32 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ఈ ఆర్ధిక సంవత్సరంలో ప్రవేశపెట్టాం. ఎన్డీఏ పార్టీలన్నీ పూర్తి సమన్వయంతో వెళ్లబట్టే అనుకున్నది సాధించగలిగాం

cbn 2047 vison : విప‌క్షం గైర్హాజ‌రు

cbn 2047 vison

ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బాధ్యతగా శాసనసభకు రాకుండా తప్పించుకు తిరుగుతోంది. ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే శాసనసభకు వస్తామని చెప్పటం ఏమిటి.? ప్రజలు ఓట్లు వేయబట్టే అధికారం, ప్రతిపక్ష హోదా వస్తాయి. ఇవన్న రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నాయి. ఇవన్నీ తెలికుండా రాజకీయం చేస్తున్నారు. గడచిన 20 నెలల్లో కష్టాలు, సమస్యల్ని అధిగమించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాం
ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేసి చూపించాం, సీఎం చంద్ర‌బాబు వివ‌రించారు.

cbn 2047 vison : అప్పుడు విధ్వంసం

cbn 2047 vison

విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి సంక్షేమం వైపుగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. గత పాలనలో అన్ని వ్యవస్థలూ ధ్వంసమయ్యాయి. అలాంటి పరిస్థితి నుంచి అన్నిటినీ గాడిన పెట్టాం. 92 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 85 డీఫంక్ట్ అయిపోయాయి. నిధులు దారిమళ్లించేసారు. ఒక్క జల జీవన్ మిషన్ లో 85 వేల కోట్లు రావాల్సి ఉంటే కేవలం రూ.25 వేల కోట్లు మాత్రమే ప్రతిపాదనలు పెట్టారు. ఈ పథకాన్ని మొత్తం మార్చేసి 5 ఏళ్ల కాలంలో ఖర్చు చేసింది కేవలం రూ.2500 కోట్లు మాత్రమే మేం అధికారంలోకి వచ్చాక ఈ కార్యక్రమానికి పొడిగింపు కోరాం. దీనిపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందిస్తున్నా ఇంటింటికీ కుళాయి ఇచ్చేలా ఈ జల్ జీవన్ మిషన్ ను ప్రణాళిక చేశాం. ప్రజలకు మెరుగైన సుపరిపాలన ఇచ్చేందుకు నిరంతరం పోరాటం చేశాం, అని ఏపీ సీఎం స్ప‌ష్గం చేశారు.

cbn 2047 vison : అప్సుల పాలు చేశారు

గత పాలకులు ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. ఎమ్మార్వో ఆఫీసు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సర్క్యూట్ హౌస్ లాంటి ఆస్తులు తాకట్టు పెట్టారు 12, 13 శాతాలకు వడ్డీలకు తెచ్చి ప్రభుత్వ ఆర్ధిక వనరుల్ని దుర్వినియోగం చేశారు. రూ.43,298 కోట్ల విలువైన అప్పులు రీషెడ్యూలు చేయించాం. తద్వారా రూ.328 కోట్ల మేర ఆదా అవుతుంది
మరో రూ.1 లక్ష కోట్ల మేర అప్పులు కూడా రీషెడ్యూలు చేసేలా చర్యలు తీసుకుంటాం. రూ.1658 కోట్లు ఆర్ధికంగా వెసులుబాటు వస్తుంది. ఈ నిధులతో మరో సంక్షేమ పథకం అమలు చేసే అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది జూన్ నాటికి జాతికి అంకితం చేసేలా పనులు వేగంగా చేపట్టాం, అని సీఎం వివ‌రించారు.

cbn 2047 vison : ఒక వ్య‌క్తి స్వార్థం కోసం..

ఒక వ్యక్తి తన స్వార్ధంతో రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసేశారు. గోదావరి పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును జాతికి అంకితం చేసి నీళ్లు ఇస్తాం. ఎక్కడా లోటు పాట్లు లేకుండా చర్యలు తీసుకుంటాం కేంద్ర సహకారంతో అమరావతి రాజధానిని ట్రాక్ లో పెట్టాం, మూడేళ్లలో రాజధానికి ఓ రూపు వస్తుంది. వచ్చే సెషన్‌కు ఎమ్మెల్యేలు, మంత్రులు రాజధానిలోని వారి క్వార్టర్లలో ఉండేలా చర్యలు చేపడుతున్నాం, అని సీఎం తెలిపారు.

cbn 2047 vison : ఇప్పుడు వికాసం వైపు..

cbn 2047 vison

కేంద్రం నిధులతో విశాఖ ఉక్కును కాపాడుకున్నాం. తొలిసారి విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది. స్టీల్ ప్లాంట్ కు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారాన్ని అందిస్తోంది. రాష్ట్రానికి నీటి భద్రత అనేది అత్యంత ముఖ్యమైన అంశం. గడచిన 20 నెలల్లో దీనికి అనుగుణంగా చర్యలు తీసుకున్నాం . హంద్రీనీవాకు రూ.3850 కోట్లు మంజూరు చేసి కుప్పం వరకూ నీళ్లు తీసుకువెళ్లాం. అనంతపురం లాంటి జిల్లాలకు 55 టీఎంసీల నీటిని తీసుకువెళ్లాం. ప్రస్తుతం వేసవి వచ్చినా 628 టీఎంసీల నీరు వివిధ రిజర్వాయర్లలో నిల్వ ఉంది. సమర్ధ నీటి నిర్వహణతోనే ఇది సాధ్యమైంది. భూగర్భజలాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా గణనీయంగా పెరిగాయి.
రాష్ట్రంలో 2.96 మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగేలా వివిధ సంరక్షణా చర్యలు చేపట్టాం, భూగర్భజలాలు పెరగటం వల్ల వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గింది. ఆ మేరకు వ్యయాన్ని ఆదా చేసుకున్నాం . ఎన్ని ఇబ్బందులు ఉన్నా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం, ఆ మాట నిలబెట్టుకున్నాం
గత పాలకులు 32 వేల కోట్ల కరెంటు ఛార్జీల భారం ప్రజలపై మోపారు
గత పాలనలో ట్రూ అప్ భారం వేస్తే మేం చరిత్రలో తొలిసారి ట్రూడౌన్ చేశాం
రూ.4420 కోట్ల మేర ట్రూ అప్ భారాన్ని కూడా ప్రజలపై మోపకుండా చర్యలు తీసుకున్నాం. పీఎం సూర్యఘర్ ద్వారా ఎస్సీ,ఎస్టీ లకు ఉచితంగా సౌర ప్యానెళ్లు ఏర్పాటు చేసి ఇంటిపైనే విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు చేప‌ట్టాం. ఈ ఏడాది ప్రతీ యూనిట్ కొనుగోలు ధరను రూ. 5.19 నుంచి 4.80 కు తగ్గించేలా చర్యలు చేపట్టాం, అని వివ‌రించారు.

cbn 2047 vison : అప్ప‌దాత‌కు భ‌రోసా

cbn 2047 vison

అగ్రిటెక్ అనేది ఓ విధానంగా మార్చుకుని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. రూ.1 లక్ష కోట్లతో ఉమ్మడి ప్రకాశం సహా రాయలసీమ జిల్లాలను హార్టీ కల్చర్ హబ్ గా అభివృద్ధి చేస్తాం. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే పది సూత్రాలతో 2047 స్వర్ణాంధ్ర విజన్ రూపకల్పన చేశాం పీ4 కార్యక్రమంలో భాగంగా ఎంబీకే 10-20 కింద మరో కార్యక్రమం చేపట్టాం ఆర్ధిక అసమానతలు తగ్గించేలా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. త్వరలోనే ప్రతీ కుటుంబానికి ఫ్యామిలి బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం కార్డును కూడా జారీ చేస్తాం
కేంద్రం, రాష్ట్రం అందించే పథకాలన్నిటినీ ఈ కార్డు ద్వారా ఇంటిగ్రేట్ చేస్తాం

cbn 2047 vison : రూ.20 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డి

cbn 2047 vison

రాష్ట్రంలో 25 నూతన పాలసీలు తీసుకురావటం ద్వారా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం.. వీటితో 23 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. సర్క్యులర్ ఎకానమీ ద్వారా వ్యర్ధాల ద్వారా సంపద సృష్టిస్తున్నాం. ఇటీవలే వివాదాలకు సంబంధించి ఓ సదస్సు జరిగింది. మధ్యవర్తిత్వంపై దృష్టి పెట్టాలని సూచనలు వచ్చాయి. వివాదం పరిష్కారం అయితే రూ.10 వేల ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించాం . రాష్ట్రంలో అభివృద్ధికి అవరోధంగా ఉన్న నాలా చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి అవినీతిని కట్టడి చేశాం జన్ విశ్వాస్ ద్వారా పాత చట్టాలను మారుస్తున్నాం. దీనికి సంబంధించి బిల్లుకు కూడా శాసనసభ ఆమోదం తెలిపింది, అని సీఎం వివ‌రించారు
.
cbn 2047 vison : ప‌ల్లె ప్ర‌గ‌తి సాధ్యం చేశాం

గత పాలకులు ఐదేళ్లలో 884 కి.మీ సీసీ రోడ్లు, 234 కిలోమీటర్ల బీటీ రోడ్లు వేశారు. 4,998 కిలోమీటర్ల సీసీ రోడ్లను కేవలం 20 నెలల్లో పూర్తి చేయించేలా డిప్యూటీ సీఎం చర్యలు తీసుకున్నారు. పల్లె పండుగ, అడవి తల్లి బాట పేరిట గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా గోశాలలు నిర్మాణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం కూడా జరుగుతోంది 9 కోట్ల పనిదినాలు కల్పించేలా కూడా ఉపముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు.
న‌రేగా నుంచి వీబీజీ రామ్ జీ పథకానికి మార్పు జరిగింది. బడ్జెట్ తగ్గకుండా ఆ పథకాన్ని సమర్ధంగా వినియోగించుకుందాం. పల్లెల్లో కొత్త వెలుగులు చూసేందుకు ఉప ముఖ్యమంత్రి తీసుకుంటున్న కార్యక్రమాలను స్వాగతిస్తున్నాం

cbn 2047 vison : పిల్ల‌ల‌కు సోష‌ల్ మీడియా నిషేధం

cbn 2047 vison

విద్య రంగంలోనూ వివిధ సంస్కరణల్ని అమలు చేసి నైపుణ్యం పెంచేలా చర్యలు చేపడతాం. ఐటీ శాఖ మంత్రి సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడి తనంపై ఓ సిఫార్సు కూడా చేశారు. 16 ఏళ్లలోపు వారికి సామాజిక మాధ్యమాలను బ్యాన్ చేసే అంశంపై చర్చిస్తున్నాం. సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీల్లేదు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో స్వర్ణాంధ్ర విజన్ తయారు చేసుకున్నాం అని సీఎం తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగేలా నిర్ణయం తీసుకుంటున్నాం, మూడు ప్రాంతాల్లో ఎకనామిక్ రీజియన్లు ఏర్పాటు చేస్తున్నాం. సుప్రీం కోర్టు అనుమతితో కర్నూలుకు హైకోర్టు బెంచ్ సాధించుకునేలా చర్యలు తీసుకుంటాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో 5 లక్షల మంది మహిళల్ని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే అంశంపై సంకల్పం చేస్తాం.అని సీఎం స్ప‌ష్టం చేశారు.

cbn 2047 vison : సంక్షేమంలోనూ… ఢోకా లేదు

ఉగాదికి 3 లక్షల గృహ ప్రవేశాలు చేయించేలా చర్యలు చేపడుతున్నా హెల్తీ, వెల్తీ హ్యాపీ సొసైటీ గా ఏపీని తీర్చిదిద్దేలా కార్యాచరణ చేపడుతున్నాం. సంజీవని ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు తయారు చేస్తున్నాం, గిన్నీస్ రికార్డు సాధించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే ను నిర్వహించాం. . యోగా, నేచురోపతి లాంటి అంశాలను మేళవించి ప్రజారోగ్యాన్ని కాపాడతాం
ప్రిడెక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో ప్రజారోగ్యాన్ని సంరక్షించేలా చర్యలు తీసుకుంటున్నాం, అని సీఎం వివ‌రించారు. .

cbn 2047 vison : వైసీపీ అధినేత‌కు వాత‌లు

cbn 2047 vison

వైట్ కాలర్ క్రైమ్స్, డిజిటల్ క్రైమ్స్, సైకోలు సోషల్ మీడియాలో ఆరాచకం చేస్తున్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరిస్తున్నాను. మావోయిస్టులను కట్టడి చేశాం, ఫాక్షనిజం రూపుమాపాం తద్వారా ప్రగతి సాధించాం. ఇప్పుడు కొత్తగా రప్పా రప్పా రాజకీయం వచ్చింది. ఏదైనా రాజకీయనాయకుడు పర్యటన చేస్తే రప్పా రప్పా ఏమిటి?
పెళ్లికి వెళ్తే కూడా రప్పా రప్పా అంటూ దాడులు చేయాలా.? భద్రతకు వెళ్లిన ఎస్ఐ గాయపడేలా పర్యటనలు ఉంటాయా? గంజాయి, డ్రగ్స్, బ్లేడ్ బ్యాచ్‌ల ను పక్కన పెట్టుకునే నాయకుడు ఎక్కడైనా ఉంటారా.? కటౌట్లకు పొట్టేళ్లతో రక్తాభిషేకం చేయటం ఏమిటి? ఇంత నేరుగా హింసను ప్రోత్సహిస్తారా?
పోస్టు మార్టానికి కారకులే పోస్టు మార్టానికే వెళ్తారు. రాష్ట్రంలో ఈ విధ్వంస యాత్రలు ఏమిటి, టైర్లు కింద మనుషుల్ని తొక్కించి నింద ప్రభుత్వంపై వేస్తారు పరామర్శలకు వెళ్లి బలప్రదర్శనలు చేయటం ఏమిటి. 5 కిలోమీటర్లను 6-7 గంటల ప్రయాణం చేస్తారా ఎవరైనా? ప్రతిపక్షంలో ఉండి పెట్టుబడులు రాకుండా ఇష్టానుసారం మాట్లాడతారా? మేం అధికారంలోకి వస్తే పెట్టుబడులు రద్దు చేస్తామంటూ హెచ్చరికలు చేయటం ఏమిటి? దేశంలో ఏ రాజకీయ పార్టీ ఈ విధంగా వ్యవహరించలేదు. శ్రీవేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. తెలియకుండా జరిగిన నేరంకాదిది. కుట్రతోనే కాపాలని చేసిన నేరం ఇది
ఏడు కొండలను రెండు కొండలు చేసినప్పటి నుంచే ఈ కుట్ర కొనసాగుతోంది. ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక కూడా స్పష్టంగా తేల్చి చెప్పింది అది కల్తీ నెయ్యి అని.
దేశ వ్యాప్తంగా హిందూ మఠాలు, పీఠాలు ముక్త కంఠంతో వ్యతిరేకించినా కనీసం ఆ పార్టీ క్షమాపణ చెప్పలేదు. ప్రభువా క్షమించు అంటూ సాక్షి పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాయించుకున్న వ్యక్తి నైవేద్యం కల్తీ చేసి క్షమాపణలు చెప్పరా? మత సామరస్యాన్ని గౌరవిస్తూ క్షమాపణ చెప్పకుండా దౌర్జన్యం చేస్తున్నారు శాసనమండలిలోనూ ఇదే అంశంపై గొడవ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారా.? అని వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని సీఎం చంద్ర‌బాబు నాయుడు తూర్పార‌బ‌ట్టారు.

cbn 2047 vison : యుద్ధంతో మ‌న‌కీ ఒడిదుడుకులే

ఎక్కడో జరుగుతున్న యుద్ధాల వల్ల ఆ పరిస్థితులు మన మార్కెట్ ను ప్రభావితం చేస్తున్నాయి ఎగుమతులు పడిపోవటంతో అరటి ధర తగ్గిపోయింది. చమురు ధరల వల్ల కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది.

cbn 2047 vison : 2029లోనూ గెల‌వాల్పిందే

cbn 2047 vison

ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలి ప్రజాప్రతినిధులు- అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని కోరుతున్నాను. కూటమిగా వెళ్లి ప్రజల మద్దతుతోనే అంతా గెలిచామని గుర్తుంచుకోవాలి . వ్యక్తిగత ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి, పార్టీలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కోరుతున్నాను . 15 ఏళ్ల పాటు ఎన్డీఏ కూటమి కొనసాగితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నారు . కూటమిగా మనకు ఓ అజెండా ఉంది. 2029లోనూ మనం అంతా గెలవాలి. 2047 లక్ష్యాలను సాధించుకోవాలి, అని అసెంబ్లీలో ఎమ్మెల్యేల‌ను, మంత్రుల‌కు సీఎం సూచించారు.

cbn 2047 vison : ఏపీ అసెంబ్లీ ఏక‌గ్రీవ తీర్మానం

cbn 2047 vison

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన “ఆత్మ నిర్భర్ వికసిత్ భారత్” సంకల్పానికి అనుగుణంగా, రాష్ట్రాన్ని ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో మరింత బలోపేతం చేయాలి. అని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిసింది.
• వికసిత్ భారత్-2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపడం ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం.
• 2047 నాటికి భారత దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి ఆర్ధిక వ్యవస్థగా నిలబెట్టి, రాష్ట్రాని రూ.308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది.
• స్థానిక పరిశ్రమల అభివృద్ధి, తలసరి ఆదాయం పెంపు, ఏటా 15 శాతం స్థిరమైన వృద్ధి రేటు నమోదు చేయాలనే ఘనమైన లక్ష్యాల సాధనకు ఈ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది.
• కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలను సాధించేలా ఈ సభ మద్దతు కోరుతూ “వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర-2047 సంకల్ప ప్రతిజ్ఞ” చేయాల్సిన సమయమిది.
• వోకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్ అంటూ రెండు దశలలో రాష్ట్రాన్ని ఒక తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం.
• తొలిదశ వోకల్ ఫర్ లోకల్ భాగంగా స్థానిక ఉత్పత్తులను పెంచడం, వాటికి ఒక బ్రాండ్ ఇమేజ్‌ను సృష్టించాలని నిర్ణయించాం.
• రెండో దశ లోకల్ టు గ్లోబల్. ప్రపంచ స్థాయి నాణ్యతతో తయారైన ఉత్పత్తులతో అంతర్జాతీయ మార్కెట్లలో మన స్థానిక ఉత్పత్తులు పోటీ పడేలా చేయడం.
• ప్రతీ ఇంటా స్వదేశీ-ఇంటింటా స్వదేశీ సిద్ధాంతాలకు ప్రాధాన్యతనిస్తూ స్థానిక ఉత్పత్తులనే వినియోగించాలి.
• స్థానిక వర్గాలకు మద్దతు ప్రకటించాలి, ఎంఎస్ఎంఈలు, చేతివృత్తుల వారు శిల్పకారులు, రైతులు, చేనేత కార్మికులు, యువ పారిశ్రామికవేత్తల అభివృద్ధికి సంపూర్ణ మద్దతు తెలపాలి.
• రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించేలా ప్రజలను ప్రోత్సహిస్తూ, రాష్ట్ర ఆర్థిక స్వావలంబన, సాంస్కృతిక గౌరవాన్ని కాపాడటానికి కట్టుబడి ఉండాలి.
• రాష్ట్రాభివృద్ధి తద్వారా దేశాభివృద్ధి దిశగా సభ్యులందరూ కలిసి సామూహిక సంకల్పాన్ని వ్యక్తపరచడం ఒక చారిత్రాత్మక అడుగు.

ALSO READ : AP DY.CM fIRE : నెయ్యిలో నెయ్యే లేదు Andhra prabha news

Leave a Reply