సర్పంచ్ సహా పలువురి పై కేసులు నమోదు..

సర్పంచ్ సహా పలువురి పై కేసులు నమోదు..

చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : మండలంలోని బాపునగర్ గ్రామంలో జరిగిన ఘర్షణ ఘటనలో కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదే గ్రామానికి చెందిన అజ్మీర రాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమీనాబాద్ గ్రామానికి చెందిన కుమారస్వామి, సర్పంచ్ రంజిత్, ఉపసర్పంచ్ హరీష్, అశోక్, రాజు, శ్రవణ్‌లపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌.ఐ. రాజేష్ రెడ్డి తెలిపారు.

అదేవిధంగా, బాపునగర్‌కు వెళ్లి గొడవ విషయంపై మాట్లాడే క్రమంలో తమపై దాడి చేశారని సర్పంచ్ రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాపునగర్‌కు చెందిన అజ్మీర రాజు, భూక్య రాజు, భాస్కర్, గణేష్, రాజేందర్ తదితరులపై కూడా కేసులు నమోదు చేసినట్లు ఎస్‌.ఐ. తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply