Case | సర్పంచ్ అభ్యర్థిపై కేసు నమోదు

Case | సర్పంచ్ అభ్యర్థిపై కేసు నమోదు
Case | గుడిహత్నూర్, ఆంధ్రప్రభ : గుడిహత్నూర్ (Gudihathinur) మండలంలోని ముత్తూట్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి (Sarpanch candidate) పై సుభాష్ (Subhash) పై కేసు నమోదైనట్లు గుడిహత్నూర్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
ఓటర్లను మభ్యపెట్టేందుకు డబ్బులు పంచుతున్న సమయంలో అభ్యర్థిని పట్టుకుని రూ.2,700నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఎన్నికల నిబంధనలను (election rules) ఉల్లంఘించినందుకు సంబంధిత అభ్యర్థిపై కేసు (case) నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.ఎన్నికల సమయంలో డబ్బులు, మద్యం పంపిణీ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.
