400 మంది వైపీపీ నేతలపై కేసు
పేర్ని నాని ప్రధాన నిందితుడు
ఆంధ్రప్రభ, మచిలీపట్నం ప్రతినిధి : అనుమతి లేని ఛలో మెడికల్ కాలేజీ(Chalo Medical College) నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సుమారు 400మందిపై మచిలీపట్నం (Machilipatnam) పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. మాజీ మంత్రి పేర్ని నాని, పేర్ని కిట్టు, కైలే అనిల్, సింహాద్రి రమేష్, దేవబత్తుల చక్రవర్తి, దేవినేని అవినాష్ (DevineniAvinash) ప్రధాన నిందితులుగా కేసు నమోదు చేశారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించారి, పోలీసుల(Police) పట్ల కూడా దురుసుగా వ్యవహరించారని, అనుమతి లేకున్నా నిరసన కార్యక్రమం(protest program) నిర్వహించారని పోలీసులు కేసు (Police case) నమోదు చేశారు.