Car Overturned | కారు బోల్తా… ముగ్గురు మృతి..

Car Overturned | కారు బోల్తా… ముగ్గురు మృతి..
Car Overturned | ఆదిలాబాద్: కారు బోల్తా (car overturned) పడి… ముగ్గురు మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని జైనథ్ మండలం తరోడ గ్రామం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మూలమలుపులో అదుపు తప్పిన కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. జైనథ్ నుండి ఆదిలాబాద్ (Adilabad) వెళ్తున్న సమయంలో కారు అదుపు తప్పింది. షేక్ మొహినుద్దీన్, షేక్ మోహిన్, కదం కీర్తి సాగర్లు ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను రిమ్స్ కు పోలీసులు తరలించారు.
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల (Road accidents) బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అధికమయ్యాయి. డిసెంబర్ 7వ తేదీ నాలుగు యువకులు కారులో ప్రయాణిస్తుండగా, మంచు కారణంగా ఓ వాహనం డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు శ్రీపతి అశ్రిత్ రెడ్డి, పప్పుల శివమణి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే మరో ఘటనలో కీసర నుంచి తార్నాకకు వెళ్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టడంతో హర్షవర్ధన్ (మల్కాజిగిరి నివాసి) మృతి చెందాడు.
