బైక్‌ను ఢీకొట్టిన కారు

బైక్‌ను ఢీకొట్టిన కారు

లోయ‌లోకి దూసుకెళ్లిన కారు.. ప‌రారైన నిందితులు
బ‌య‌ట‌ప‌డిన ఎర్ర‌చంద‌న దుంగ‌లు
ద్విచ‌క్ర‌వాహ‌న‌దారుడికి గాయాలు
చిత్తూరు జిల్లాలో ప్ర‌మాదం

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: ఎర్ర చందనం తరలిస్తున్న కారు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టి లోయలో ప‌డిన సంఘటన చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ వ‌ద్ద‌ జరిగింది. కారులో 9 ఎర్రచందనం దుంగలు ఉన్న‌ట్లు గుర్తించారు. కారును వదిలి అందులో ఉన్న‌వారు ప‌రార‌య్యారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం పలమనేరు చిత్తూరు జాతీయ రహదారిపై కాటప్పగారిపల్లె రోడ్డు సమీపంలో బుధవారం ఉదయం పలమనేరు నుంచి చిత్తూరు వైపు ఎర్రచందనం 9దుంగలతో చిత్తూరు వైపు వస్తున్న కారు (KA05MD4456) డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు అటు వైపుకు దూసుకెళ్లి కొరివారిపల్లి నుండి బంగారుపాళ్యం వైపు వెళుతున్న బైక్‌ను ఢీకొట్టింది.

దీంతో బైక్‌పై ఉన్న వెంకటస్వామి గాయ‌ప‌డ్డాడు. ఈ ప్ర‌మాదంలో కారు రోడ్డు పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. అనంత‌రం కారులో ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లు కారు వ‌దిలి పారిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న బంగారుపాళ్యం పోలీసులు ద్విచక్ర వాహనాన్ని, కారు, ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply