కృష్ణలంక, ఆంధ్రప్రభ: రాణిగారితోట గుడ్ మార్నింగ్ టీ–స్టాల్ సమీపంలోని జాతీయ రహదారిపై దుర్ఘటన చోటుచేసుకుంది. రాణిగారితోటలోని కరెంట్ ఆఫీస్ దగ్గర నివసించే ఓర్స్ వెంకటస్వామి (56) పండ్లు కొనుకుని ఇంటికి తిరిగి వస్తుండగా నేతాజీ బ్రిడ్జ్ వద్ద రోడ్డు దాటే సమయంలో ప్రమాదానికి గురయ్యాడు.
బెంజ్ సర్కిల్ వైపు నుంచి వారధి దిశగా అధిక వేగంతో నిర్లక్ష్యంగా దూసుకొచ్చిన కారు వెంకటస్వామిని ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారంతో 108 అంబులెన్స్ చేరుకుని పరిశీలించగా అప్పటికే వెంకటస్వామి మృతి చెందినట్లు నిర్ధారించింది.
ఈ విషయాన్ని తెలిసిన మృతుడి బంధువులు గవర్నమెంట్ హాస్పిటల్కు చేరుకుని ఆయన మరణాన్ని ధృవీకరించారు. కుమారుడు అభిషేక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కృష్ణలంక పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

