అన్ హ్యాపీ డే..

అన్నమయ్య జిల్లాలో తప్పిన ప్రమాదం
ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
రూ.2లక్షల కుండలు ధ్వంసం
రేకుల షెడ్డు.. బైకు తుక్కు తుక్కు

ఆంధ్రప్రభ, కురబలకోట (అన్నమయ్య జిల్లా)
హ్యాపీ హ్యాపీగా హార్సిలీ హిల్స్ లో జాలీగా.. సందడి చేయటానికి బయలు దేరిన యువకులకు .. పెద్ద ప్రమాదం తప్పింది. జోరుగా హుషారుగా పరుగులు తీస్తున్న కారు.. ఓ ఇంటిలోకి దూసుకుపోయింది. ఆ ఇంటి యజమానికి తీవ్ర నష్టం కలిగింది. వివరాల్లోకి వెళ్తే.. పలమనేరుకు చెందిన కొందరు యువకులు సండే ఎంజాయ్ కి బీ కొత్తకోట మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్‌కు బయలుదేరారు. కురబల కోట మండలం కంటే వారి పల్లెకు చేరే సరికి.. మనోహర్ అనే వ్యక్తి ఇంట్లోకి ఈ కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో యువకులు స్పల్పంగా గాయపడ్డారు. ఇంటి ముంగిట రేకుల షెడ్డు, ఒక బైక్ ను తుక్కుతుక్కు చేసింది. అంతే కాదు, సుమారు రెండు లక్షలకు పైగా విలువచేసే మట్టి కుండలు ధ్వంసం అయ్యాయి. ప్రమాద స్థలికి చేరుకున్న కురబలకోట ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
