CAR ACCIDENT | ఘోర రోడ్డు ప్రమాదం

CAR ACCIDENT | ఘోర రోడ్డు ప్రమాదం

CAR ACCIDENT | పుత్తూరు, ఆంధ్రప్రభ : నగిరి నియోజకవర్గంలోని నగిరి మండలం వికేఆర్‌పురం దగ్గర మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 8 గంటల 45 నిమిషాల సమయంలో చెన్నై నుండి తిరుమల (Thirumala) వైపు వెళ్తున్న కారు, తిరుచానూరు నుండి తిరుత్తని ప్రయాణిస్తున్న మరో కారు ఎదురెదురుగా ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తిరుచానూరుకు చెందిన సంపత్, శంకర్ అక్కడికక్కడే మృతి చెందగా, చెన్నైకి చెందిన అరుణ్ కూడా ప్రాణాలు కోల్పోయారు. కార్లలో ఉన్న మరో ముగ్గురు వ్యక్తులును తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు మృతులను, గాయపడిన వారిని బయటకు తీశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply