కొత్త తరానికే కెప్టెన్సీ ఛాన్స్..

  • తెలుగబ్బాయికి తొలిసారి అవ‌కాశం..

భారత్‌ జట్టు త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ టూర్‌లో మూడు వన్డేలు, ఐదు టీ20లు జరగనున్నాయి. ఈ రెండు సిరీస్‌ల కోసం సెలక్టర్లు జట్టును ప్రకటించారు.

రోహిత్ శర్మ స్థానంలో, యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వన్డే జట్టు కెప్టెన్‌గా నియమితులయ్యాడు. ఇప్పటికే టెస్టుల్లో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న గిల్‌కి ఇది మరో పెద్ద అవకాశం. అతడికి డిప్యూటీగా, అంటే వైస్ కెప్టెన్‌గా… శ్రేయాస్ అయ్యర్ కు బాధ్యతలు అప్పగించారు.

వన్డే జట్టులో హిట్‌మ్యాన్, కోహ్లీ

టెస్టులు, టీ20ల నుంచి ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు వన్డే జట్టులో చోటు లభించడం గమనార్హం. మైదానంలో మళ్లీ ఈ ఇద్దరు దిగ్గజాలను చూడటం అభిమానులకు పండుగే. వీరిద్దరూ 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

టీ20లకు సూర్యకుమార్ సారథ్యం..

ఇక, పొట్టి ఫార్మాట్‌కి వస్తే… ఇటీవ‌ల త‌న కెప్టెన్సీలో భార‌త్ కు ఆసియా క‌ప్ టీ20 2025 క‌ప్‌ను సాధించిన‌ సూర్య కుమార్ యాదవ్, ఆస్ట్రేలియా టూర్‌లోనూ టీ20 జట్టుకు కెప్టెన్‌గా కొనసాగనున్నారు. T20 ఫార్మాట్‌లో అతని నాయకత్వంపై సెలక్టర్లు నమ్మకం ఉంచారు. ఇక‌ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వన్డే జట్టులో లేనప్పటికీ, టీ20 సిరీస్‌కు మాత్రం అందుబాటులో ఉన్నాడు.

వ‌న్డే జ‌ట్టులో తెలుగోడు..

ఆల్‌రౌండర్‌గా ఎంపికైన అతనికి… అంతర్జాతీయ స్థాయిలో త‌న స‌త్తా నిరూపించ‌డానికి ఈ సిరీస్ మంచి అవ‌కాశంగా మార‌నుంది. మరోవైపు, దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు వన్డేలకు ఎంపిక కాలేదు. అయితే, అతడి ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుని సెలక్టర్లు అతడిని టీ20 జట్టులోకి తీసుకున్నారు.

సిరీస్ షెడ్యూల్ :

భారత్ జట్టు విండీస్ టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరనుంది.

  • వన్డే సిరీస్: ఈ సిరీస్ అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానుంది.
  • టీ20 సిరీస్: ఈ సిరీస్ అక్టోబర్ 29 నుంచి ప్రారంభం కానుంది.

భారత వన్డే జట్టు :
శుభ్ మన్ గిల్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.

భారత టీ20 జట్టు :
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా.

Leave a Reply