Candidate | అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా
- ఖానాపూర్ సర్పంచ్ అభ్యర్థి బోయ అనిత
Candidate | మక్తల్, ఆంధ్రప్రభ : పంచాయతీ ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని ఖానాపూర్ గ్రామపంచాయతీ బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బోయ అనిత అన్నారు. గతంలో గ్రామాన్ని నాయకులు నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తీసుకురావడంలో విఫలమయ్యారని అన్నారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఎంతో అవసరమని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిదాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర నిధులను తీసుకువచ్చి గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా పనిచేస్తానని ఆమె హామీ ఇచ్చారు .ఎన్నికల్లో మోసపోయి గోస పడకుండా బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్నతనను గెలిపించి గ్రామాభివృద్ధికి సహకరించవలసిందిగా సర్పంచ్ అభ్యర్థి బోయ అనిత విజ్ఞప్తి చేశారు.

