Candidate | గ్రామాన్ని అభివృద్ధి చేస్తా నాకు సహకరించండి
- సర్పంచ్ అభ్యర్థి జిన్నా జనార్దన్
Candidate | వేల్పూర్, ఆంధ్రప్రభ : మీలో తిరిగిన వ్యక్తిని ఓటు వేసి గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి జిన్నా జనార్దన్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని ఆక్లూర్ గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి జిన్నా జనార్దన్ తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను సునీల్ కుమార్ రెడ్డి ఇప్పిస్తాడు,నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పారు.గ్రామంలో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.ఎన్నికల్లో మోసపోయి గోస పడకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించి గ్రామాభివృద్ధికి సహకరించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి జిన్నా జనార్దన్ సూచించారు.గ్రామాన్ని అభివృద్ధి చేస్తా నాకు సహకరించండి నాకు ఒక్క అవకాశం ఇవ్వండని విజ్ఞప్తి చేశాడు.. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించండి అని కోరారు.

