Candidate | సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తా..

Candidate | ములకలపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన ములకలపల్లి గ్రామపంచాయతీ 14వ వార్డు నుంచి కాంగ్రెస్ సీపీఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మిర్యాల అవినాష్ పోటీ చేస్తున్నారు. సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. నన్ను గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలిపిస్తే ప్రధానంగా గ్రామపంచాయతీలో కోతుల సమస్య విపరీతంగా ఉన్నదని ఈ సమస్య నిర్మూలనకు ములకలపల్లి గ్రామపంచాయతీ 14 వార్డులకు నా యొక్క సొంత ఖర్చులతో బోనులు ఏర్పడి చేస్తానని వార్డులో ఉన్న ప్రధాన సమస్యలను విద్యుత్ రోడ్లు తాగునీరు సమస్యలను పరిష్కరిస్తానని అని అన్నారు. అలాగేనిత్యం ప్రజలతో ఉండి వారి యొక్క సమస్యలను తీర్చడంలో తమ వంతు సహకారం అన్నివేళ అందిస్తానని ఈ వార్డు అభివృద్ధి పదం వైపు నడిపిస్తానని నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని నా యొక్క వార్డు ప్రజల ముందు ప్రతిజ్ఞ చేస్తున్నానని వారన్నారు.

Leave a Reply