మహిళలు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలి…

మహిళలు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలి…
విజయవాడ, ఆంధ్ర ప్రభ : సర్వైకల్ కాన్సర్ ద్వారా చాలా మంది మహిళలు అనారోగ్య పాలవుతున్నారు.మహిళలు అందరు ఆరోగ్యంగా ఉండాలని తూర్పు నియోజకవర్గం శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. ఆదివారం ఉదయం విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి. చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ కె.షమ్మీ ఆధ్వర్యంలో నల్లూరి కళ్యాణ మండపం, పటమట వద్ద జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం హ్యాపీ సండేలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మహిళలందరూ అని రంగాల్లో ముందున్నారని, వారు ఎల్లపుడు ఆరోగ్యంగా ఉండాలని అంతర్జాతీయ మహిళా మహిళలకు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని అవగాహన కల్పిస్తున్నారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశ పెట్టిన ఉచిత సర్వూకల్ కాన్సర్ టీకాలు అందరూ తీసుకుని భయంకరమైన క్యాన్సర్ వ్యాధి రాకుండా నివారించుకోవాలని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయం సహాయక బృందాల కోసం రుణసదుపాయం కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని అలా మహిళల పురోగతికి తోడ్పాడుతున్నారని అన్నారు. స్వయం సహాయక బృందాలు అక్కడ ఏర్పాటు చేసిన వారి వ్యాపార స్టాల్స్ ను సందర్శించి వారికి స్ఫూర్తి కలిగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్వయం సహాయక బృందాలకు లింకేజ్ లోన్ల ద్వారా ఇచ్చిన మొత్తాన్ని చెక్కు రూపంలో వారికి అందజేశారు.
ప్రతిభావంతులైన స్వయం సహాయక బృంద వ్యాపారస్తులకు, విజయవాడ నగర పాలక సంస్థ మహిళా ఉద్యోగులకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి. సామ్రాజ్యం, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల నాయక్, సిడిఓ ఉమామహేశ్వరి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ రజియా షబీన, సిబ్బంది పాల్గొన్నారు.
