కాల్వ పూడిక మరమ్మత్తులు
నాగులుప్పలపాడు, నవంబర్4 (ఆంధ్రప్రభ) : ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా వరద ప్రవాహాలతో పూడుకుపోయిన ఉప్పుగుండూరు (Uppugundur) గ్రామ చెరువు దిగువ కాలువల్లో శుభ్రత పనులు ప్రారంభమయ్యాయి. గ్రామంలోని కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో జేసీబీ ఎక్స్కవేటర్ సహాయంతో కాలువల్లో పేరుకుపోయిన ముళ్ల చెట్లు, వ్యర్థాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి.
గ్రామ ప్రజల అవసరాన్ని గుర్తించిన స్థానిక నాయకులు స్వయంగా ముందుకొచ్చి ఈ పనులకు సహకరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ అధ్యక్షుడు కనగాల శ్రీనివాసరావు, బెల్లం శ్రీను, కుంచాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
గ్రామస్తులు మాట్లాడుతూ, కాలువలు మూసుకుపోవడంతో సాగు నీటి సరఫరా అంతరాయం కలిగిందని, ఈ మరమ్మతులు పూర్తి అయితే పంటలకు నీరందే పరిస్థితి మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

