Campaign | బాకీ కార్డుల పేరుతో ఇంటింటి ప్రచారం

Campaign | నర్సంపేట, ఆంధ్రప్రభ : ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ రోజు వరకు బాకీ పడిన పథకాలను అమలు చేయాలని ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగాలని శివరాత్రి స్వామి, గోనె యువరాజులు అన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని పలు వార్డులో కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్న పథకాలను కార్డు రూపంలో ప్రతి గడపగడప కు తిరుగుతూ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని, 25 నెలలు గడిచిన ఏ ఒక్క మహిళకు ఇవ్వలేదన్నారు.
ఇప్పటివరకు ప్రతి మహిళకు 62,500 రేవంత్ ప్రభుత్వం బాకీ ఉందని, కళ్యాణ లక్ష్మి తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఈ ఒక్క మహిళకు ఇవ్వలేదని, ఆటో కార్మికులకు 12 వేలు ప్రతి కార్మికునికి 24 వేలు బాకీ ఉన్నారని, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు బాకీ, నిరుద్యోగ భృతి 25 నెలలకు లక్ష రూపాయలు బాకీ ఉన్నారని, విద్యా భరోసా కింద ఐదు లక్షల రూపాయల బాకీ, ఫీజు రియంబర్స్మెంట్ కింద విద్యార్థులకు 8000 కోట్లు, ప్రతి విద్యార్థినికి స్కూటీ ఇస్తామని హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముత్తయ్య, రాయరాకుల సారంగం, కొల్లూరి లక్ష్మీనారాయణ, తడిగొప్పుల రణధీష్, కూరెల్లి రమేష్, వాంకుడోత్ లారెన్స్, మండల రాజేష్ నాగరాజు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
