California | అమెరికాలో ప్రమాదంలో ఇద్దరు యువతుల దుర్మరణం

California | అమెరికాలో ప్రమాదంలో ఇద్దరు యువతుల దుర్మరణం
California | గార్ల, ఆంధ్రప్రభ : అమెరికాలో కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. పదిహేను రోజుల తర్వాత మృతదేహాలు స్వగ్రామానికి చేరనున్నాయి. గార్ల (Garla) మండల మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కుమార్తె మేఘన, ముల్కనూర్ గ్రామ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కుమార్తె భావన అమెరికాలో జరిగిన రో్డ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి మృతదేహాలు అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు శనివారం రానున్నట్లు కుటుంబ సభ్యులకు ఎయిర్‌పోర్టు (Airport) అధికారులు సమాచారం ఇచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గంగావత్ వెంకన్న సంప్రదించి మృతదేహాలు స్వాధీనం చేసుకోవల్సింది. అనంతరం వారి స్వగ్రామాలకు తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

