By Accident | రైలు నుండి జారిపడి..
వ్యక్తి మృతి
వరంగల్ రైల్వే స్టేషన్లో ఘటన
By Accident | కరీమాబాద్, ఆంధ్రప్రభ : రైలు ఎక్కబోతూ ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతిచెందిన ఘటన వరంగల్ రైల్వే స్టేషన్ (Railway Station) లో చోటుచేసుకుంది. ఎన్ఎస్ఎస్ జిఆర్పిసిఐ పి.సురేందర్ కథనం ప్రకారం… బుధవారం సుమారు 45-50 సంవత్సరాలు కల వ్యక్తి వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం నెంబర్-1 పై వరంగల్ నుండి ఖమ్మం వైపు వెళ్లు కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఎక్కబోతూ ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతి చెందాడని సీఐ తెలిపారు.
మృతుడు తెలుపు, లేత నీలి రంగు దానిపై బ్రౌన్ కలర్ లైన్స్ గల ఫుల్ షర్ట్, పెసర రంగు పాయింట్ ధరించి ఉన్నాడు. మృతుడు 5’5″ ఎత్తు, చామన ఛాయ రంగు కలిగి ఉండి.. ఎడమ పక్క రిప్స్ పై పుట్టమచ్చ, మొలకు నల్లటి ఒక వరుస మొలదారం కలిగి ఉండి, మృతుని వద్ద ఖమ్మం నుండి వరంగల్ నిన్నటి రోజు ప్రయాణించిన రైల్వే టికెట్ (Railway Ticket) తప్ప ఎలాంటి ఆధారాలు గాని, గుర్తింపు కార్డులు లేవు. మృతదేహాన్ని వరంగల్ MGM ఎంజీఎం మార్చురీ రూమ్ లో భద్రపరిచినట్లు తెలిపారు. ఏమైనా వివరాలు తెలిస్తే ఎస్ రవీందర్ రెడ్డి రైల్వే హెడ్ కానిస్టేబుల్ వరంగల్ కు ఫోన్ నెంబర్లు 98497 49220 .8712658627 తెలపవచ్చని తెలిపారు.

