Business | లాభాలతో స్టాక్ మార్కెట్ ప్రారంభం

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ సూచీలు రాణిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 424 పాయింట్ల లాభంతో 80,666 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 88 పాయింట్ల లాభంతో 24,422 వద్ద ఉన్నాయి. >సెన్సెక్స్‌ 30 సూచీలో అదానీ పోర్ట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

నెస్లే ఇండియా, టైటాన్‌, ఎటర్నల్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ఫైనాన్స్‌, సన్‌ఫార్మా, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.

Leave a Reply